Nawazuddin Siddiqui: పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దక్షిణాది సినిమాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. బాహుబలి సినిమా తర్వాత ఉత్తరాది ఇండస్ట్రీలో దక్షిణాది సినిమాల క్రేజ్ వేరే స్థాయి కి మారిపోయింది. భాషతో సంబంధం లేకుండా దక్షిణాది సినిమాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినిమాలను ఇతర భాషల సినీ ప్రేమికులు అమితంగా ఇష్టపడుతున్నారు. దీంతో బాలీవుడ్ తారలు సౌత్ సినిమాల్లో నటించేందుకు మునుపటికంటే ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే విడుదలైన కల్కి సినిమా లో నార్త్ నటీనటులే ఎక్కువగా ఉన్నారన్న విషయం మర్చిపోవద్దు.
nawazuddin siddiqui comments on south industry
అమితాబ్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి భారీ నటులు కల్కిలో కీలక పాత్రలు పోషించగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీలో బిటౌన్ హీరో ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కలయిక లో రాబోతున్న దేవర చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించనున్నాడు. వీరే కాకుండా హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా సౌత్ చిత్రాలలో ముఖ్యమైన పాత్రలు చేస్తూ ఇక్కడి ప్రేక్షకులకు కనెక్ట్ అవుతున్నాడు. వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమాతో తెలుగు తెరపైకి వచ్చాడు ఈ విలన్.
Also Read: Kanchi Kaul సంపంగి హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో చూడండి?
అలాగే మరెన్నో తెలుగు చిత్రాలలో కూడా నటించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన దక్షిణాది సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సినిమాల్లోకి వచ్చింది డబ్బు కోసం కాదని, నటనపై ఉన్న ప్రేమతో అన్నారాయన. రామం రాఘవం లాంటి సినిమా చేసినప్పుడు ఆ పాత్రలోని భావోద్వేగాలు, ఆలోచనలపై తన పూర్తి దృష్టి ఉంటుందన్నారు. అయితే దక్షిణాది సినిమాల విషయం లో తాను కమర్షియల్గా ఉంటానని.. పారితోషికం ఎక్కువ మొత్తం లో తీసుకుంటున్నానని.. అంటున్నారు.కానీ తను ఆ విషయంలో పట్టించుకోనని అన్నారు.
షూటింగ్ కు ముందు ఎవరో ఒకరు ఆ పాత్రకు, సన్నివేశానికి సంబంధించి వివరణ ఇస్తున్నారని.. ఏ డైలాగ్స్ చెప్పాలనే విషయాన్ని ఎవరో ఒకరు చెప్తున్నారని.. కొన్నిసార్లు అక్కడేం జరుగుతుందనేది తనకు అర్థం కావడంలేదని అన్నారు. ఏదో యాడ్ షూటింగ్ కు వచ్చినట్లుగా కానిచ్చేస్తున్నానని.. డబ్బులిస్తున్నారు.. నటిస్తున్నాను.. అంతే అన్నట్లుగా ఉంటుంది.. కానీ ఆ పాత్రకు సంబంధించిన ఎమోషన్స్ పెంచుకోవడం లేదు.. ఆ విషయంలో మాత్రం సిగ్గుపడుతున్నానని అన్నారు. ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్ధిఖీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం అతని చిత్రం రౌతు కా రాజ్ zee5లో ప్రసారం అవుతోంది.మరి భవిష్యత్ లో దీన్ని మెరుగుపరుచుకుంటారా అనేది చూడాలి.