Nayanthara: చంద్రముఖి వివాదంలో నయనతార.. 5 కోట్లు కట్టాల్సిందే.?
Nayanthara: నయనతార ఈ మధ్యకాలంలో వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది.. అయితే తాజాగా మరో వివాదంలో కూడా చిక్కుకుంది.చంద్రముఖి మూవీకి సంబంధించిన వివాదంలో నయనతార చిక్కుకుంది. దీంతో ఐదు కోట్లు డిమాండ్ చేస్తూ ఈమెపై కేసు వేశారు. ఇక విషయంలోకి వెళ్తే..రీసెంట్గా నయనతార తనకి సంబంధించిన బియాండ్ డది ఫేయిరి టెయిల్ అనే డాక్యుమెంటరీ రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే.
Nayanthara in the Chandramukhi controversy
అయితే ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా చేసిన నానుమ్ రౌడీ ధాన్ సినిమాలోని ఒక క్లిప్ ని వాడుకున్నందుకు ధనుష్ నయనతార పై 10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. దీంతో నయనతార ధనుష్ పై ఉన్న పగని బయటపెట్టింది. అయితే తాజాగా నయనతారకు సంబంధించిన డాక్యుమెంటరీ పై మరో చిత్ర యూనిట్ కేసు వేశారు. ఇక సినిమా ఏంటంటే.. (Nayanthara)
Also Read: Poonam kour: నా లైఫ్ నాశనం చేసి హ్యాపీగా.. త్రివిక్రమ్ బండారం బయటపెట్టిన పూనమ్.?
చంద్రముఖి.. రజినీకాంత్,నయనతార, జ్యోతిక కాంబినేషన్లో వచ్చిన చంద్రముఖి సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాలోనివి నయనతార నిర్మాతల అనుమతి తీసుకోకుండానే కొన్ని క్లిప్స్ వాడుకున్నట్టు తెలుస్తోంది.ఇక ఈ విషయం తెలిసిన చంద్రముఖి నిర్మాతలు నెట్ఫిక్స్ కి నయనతార కి లీగల్ గా నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది.
అలాగే అనుమతి లేకుండా తమ సినిమాకి సంబంధించిన క్లిప్స్ ని వాడినందుకు ఐదు కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటూ డిమాండ్ చేశారట. మరి ఈ విషయంపై నయనతార ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్యకాలంలో నయనతార చట్టపరమైన సమస్యల్లో ఎక్కువగా ఇరుక్కుంటుంది.(Nayanthara)