Tamannaah: నయనతార ప్రభుదేవా మధ్య చిచ్చు పెట్టింది తమన్నానేనా.?
Tamannaah: నయనతార ప్రభుదేవాల మధ్య ఎంత మంచి ప్రేమ ఉండేదో చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇక వీరి ప్రేమ విషయం బయటపడ్డాక పబ్లిక్ గానే తిరుగుతూ తెగ ఎంజాయ్ చేశారు. అలాగే ప్రభుదేవా ని పెళ్లి చేసుకోవడం కోసం నయనతార ప్రభుదేవా పెట్టిన కండిషన్లకు కూడా ఓకే చేసింది. అలా మతం మార్చుకోవడానికి కూడా వెనకడుగు వేయలేదు.
Nayanthara Prabhu Deva broke up because of Tamannaah
కానీ వీరి మధ్య ఎలాంటి గొడవ జరిగిందో ఏమో కానీ చివరికి బ్రేకప్ జరిగింది. అలా వీరిద్దరూ ఎవరి జీవితంలో వాళ్ళు సెట్ అయిపోయారు. అయితే వీరిద్దరికీ మధ్య బ్రేకప్ జరగడానికి అనేక రూమర్లు వినిపించాయి. మొదటిది నయనతార సినిమాలో నటించకూడదని ప్రభుదేవా కండిషన్ పెట్టారని అయితే దీనికి నయనతార ఒప్పుకుందట. (Tamannaah)
Also Read: Rambha: రంభ కాపురంలో నిప్పులు పోసిన హీరోయిన్.. పాపం అంత బాధపడిందా.?
అంతేకాదు ఆ మధ్యకాలంలో నటనకు బ్రేక్ ఇస్తున్నాను అంటూ ఓ పెద్ద అనౌన్స్మెంట్ కూడా చెప్పింది. దీంతో ఆమె ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు. అంతేకాకుండా ప్రభుదేవా మొదటి భార్యకు ఉన్న పిల్లల్ని కూడా నయనతారని చూసుకోమని చెప్పారట. అయితే పిల్లల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిపోయారని టాక్ వినిపించింది. అయితే మరో రూమర్ ఏమిటంటే..
నయనతార తో ప్రభుదేవా రిలేషన్ మెయింటైన్ చేస్తూనే తనతో నటించిన తమన్నా తో కూడా డేటింగ్ చేసినట్టు వార్తలు వినిపించాయి. అలా తమన్నాతో కలిసి ప్రభుదేవా అభినేత్రి సినిమా చేసిన సమయంలో ఇద్దరి మధ్య డేటింగ్ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ డేటింగ్ రూమర్స్ నయనతార దాక వెళ్లడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి బ్రేకప్ చెప్పుకున్నారనే టాక్ వినిపించింది.(Tamannaah)