Nayanthara: పిల్లలతో ముంబై లో నయన్.. అక్కడేం చేస్తుందబ్బా!!

Nayanthara: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా ప్రస్తుతం ముంబై షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. దర్శకురాలు గీతు మోహందాస్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, నయనతార షూటింగ్ కోసం తన పిల్లలతో కలిసి ముంబై వెళ్లడం విశేషం.
Nayanthara Spotted in Mumbai for Toxic
ఇందులో నయనతార పాత్రపై ఇంకా అధికారిక సమాచారం బయటకు రాలేదు, కానీ కొందరు విశ్వసనీయ వర్గాల ప్రకారం యశ్‌కు సోదరిగా కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో కియారా అద్వాణీ, హూమా ఖురేషీ, తారా సుతారియా, అక్షయ్ ఒబెరాయ్ వంటి ప్రముఖ నటీనటులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే కథలో యశ్ ఇంకా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించనున్నారు.
యశ్ 39వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘టాక్సిక్’ టీజర్కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ టీజర్‌లో యశ్ స్టైలిష్ లుక్, తెల్లటి కోటు, ఫెడోరా హ్యాట్ హైలైట్‌గా నిలిచాయి. మొదట ఈ సినిమా ఏప్రిల్ 2025లో విడుదల కావాల్సి ఉండగా, తాజా సమాచారం ప్రకారం 2026 మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది.
‘టాక్సిక్’ కన్నడ, ఇంగ్లీష్‌లో షూట్ చేస్తున్నప్పటికీ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. KGF తర్వాత యశ్ మరోసారి ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్తో వస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.