Squid Game New Season: స్క్విడ్ గేమ్ 3 స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. అంచనాలు విపరీతం..కొత్త ట్విస్ట్‌లు..

Netflix Squid Game New Season Update

Squid Game New Season: ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన కొరియన్ వెబ్ సిరీస్ Squid Game మూడో సీజన్‌తో ప్రేక్షకులను మళ్లీ అలరించేందుకు సిద్ధమైంది. Netflix తాజాగా విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, Squid Game Season 3 జూన్ 27, 2025న స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ వార్త అభిమానుల్లో భారీ స్థాయి అంచనాలను పెంచింది.

Netflix Squid Game New Season Update

కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో విడుదలైన Squid Game Season 1 ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించబడిన వెబ్ సిరీస్‌గా నిలిచింది. ఆసక్తికరమైన కథ, ఉత్కంఠభరితమైన thriller elements, సామాజిక చైతన్యాన్ని కలిగించే మెసేజ్ కారణంగా ఈ సిరీస్ ఘన విజయం సాధించింది. రెండో సీజన్ కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకున్నప్పటికీ, మూడో సీజన్ మరింత ఉత్కంఠభరితంగా ఉండనుందని అంచనా.

ఈ సిరీస్ ప్రత్యేకత ఏంటంటే, ప్రతి ఎపిసోడ్‌లో వుండే suspense, అద్భుతమైన visual storytelling, ఆకట్టుకునే నేపథ్యం. ఇప్పటికే విడుదలైన teasers ప్రకారం, Season 3 లో మరింత డార్క్ నేరేటివ్, కొత్త కేరెక్టర్స్ మరియు షాకింగ్ ట్విస్ట్‌లు ఉండనున్నాయి. ఈ సారి కథలో కొత్త కోణాలు, అంచనాలను మించే మార్పులు ఉండే అవకాశం ఉంది.

జూన్ 27న విడుదలయ్యే Squid Game Season 3 ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్ మళ్లీ ఆధ్యంతం ఉత్కంఠగా ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. మరి, ఈ సీజన్ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా? వేచిచూడాల్సిందే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *