HCU: హెచ్‌సీయూ విద్యార్థులపై కొత్త కుట్ర?
HCU: కంచె గచ్చిబౌలి కోసం పోరాడతారా.. మీ యూనివర్సిటీనే మీకు దక్కనివ్వం అంటూ హెచ్‌సీయూ విద్యార్థులపై కాంగ్రెస్ కుట్ర?చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ఉన్న కంచె గచ్చిబౌలి భూముల పరిరక్షణ కోసం పోరాడిన హెచ్‌సీయూ విద్యార్థులపై రేవంత్ సర్కార్ ప్రతీకారం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్ నడుస్తుంది.

New conspiracy against HCU students
వివిధ జీవరాశులకు నెలవైన కంచె గచ్చిబౌలిలో అటవీ విధ్వంసానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన విద్యార్థులకు వాళ్ళ క్యాంపస్‌నే లేకుండా చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కట్టబోయే ఫ్యూచర్ సిటీలో హెచ్‌సీయూకు కేవలం 100 ఎకరాలు కేటాయించి, క్యాంపస్‌ను షిఫ్ట్ చేసి చేతులు దులుపుకోవాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
Rohit Sharma: ఐపీఎల్ 2025 నుంచి రోహిత్ శర్మ ఔట్?
సుమారు 100 ఎకరాల్లో నిర్దాక్షిణ్యంగా చెట్లను నరికేసి.. మూగజీవాలకు నీడ లేకుండా చేసిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు హెచ్‌సీయూ భూములను లాక్కొన్ని పార్క్ డెవలప్ చేస్తామని చెప్పుకుంటుంది. హెచ్‌సీయూ విద్యార్థుల పోరాటం వల్ల.. సుప్రీం కోర్టులో చీవాట్లు పడటంతో పాటు, జాతీయ స్థాయిలో కూడా అనుకోని విధంగా పరువు పోవడంతో.. ఇప్పుడు ఇలా హెచ్‌సీయూ విద్యార్థులను బెదిరించి రేవంత్ సర్కార్ రివెంజ్‌కు ప్లాన్ చేస్తుంది అని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Pitapuram: పిఠాపురం నియోజకవర్గంలో నాగబాబుపై తిరుగుబాటు ?