Nidhi Agarwal: రాజా సాబ్ లో నా పాత్ర నాపై ఉన్న ఆ ఓపినియన్ ను మారుస్తుంది!!
Nidhi Agarwal: తెలుగులో ఇప్పటివరకు చేసిన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నిధి అగర్వాల్ భవిష్యత్ లో పెద్ద హీరోయిన్ అయ్యే అన్ని అర్హతలను కలిగి ఉంది. టాలీవుడ్లో తన కెరీర్ ప్రారంభంలో కొన్ని వైఫల్యాలను అందుకన్న నిధి అగర్వాల్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తిరిగి పుంజుకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో, ఆమె నటన మరియు గ్లామర్ పాత్రతో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది.
సవ్యసాచి మరియు మిస్టర్ మజ్ను సినిమాల్లో నిధి అగర్వాల్ నటించినప్పటికీ, అవి పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. మొదటి సినిమా డిజాస్టర్ కాగా, రెండవ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. కానీ ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత, నిధి అగర్వాల్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమాలో ఆమె పాత్ర ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది.
ఇప్పుడు ఆమె రెండు భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వాటిలో ఒకటి ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’ సినిమా. ఈ చిత్రంపై నిధి అగర్వాల్ ఆశలు పెంచుకుంటోంది. ఆమె మాట్లాడుతూ, “ప్రేక్షకులు నాకు గ్లామర్ పాత్రలనే ఎక్కువగా ఆశిస్తున్నారనుకుంటాను. నేను కూడా అలాంటి పాత్రలలో ఎక్కువగా నటిస్తానని చెప్పాను. కానీ, రాజా సాబ్ సినిమాలో నా పాత్ర వారికి కొత్త అనుభవాన్ని ఇస్తుందని చెప్పింది.
ఈ చిత్రం ద్వారా ఆమె అభిమానుల అభిప్రాయాన్ని మార్చనున్నట్లు చెప్పింది. ప్రభాస్ వంటి స్టార్‌తో సినిమా చేయడం ఆమెకు ప్రత్యేకమైన అవకాశం అని భావిస్తోంది. ఇప్పటికే ఆమె ‘రాజా సాబ్’ లో చేసే పాత్ర గురించి కొంతమంది ఆసక్తి చూపుతున్నారు.