Nidhi Agarwal: హీరోతో ఎఫైర్.. పెళ్లికి రెడీ అయిన నిధి అగర్వాల్..?

Nidhi Agarwal: తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. వీరిలో ఒక ప్రత్యేకత చాటుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్. “సవ్యసాచి” అనే చిత్రం ద్వారా తెలియ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాల్లో దూసుకుపోతూ కెరియర్ లో మంచి పొజిషన్ కు వెళ్తోంది.. అయితే సవ్యసాచి అనే సినిమా తర్వాత ఈమెకు భారీ హిట్ ఇచ్చిన మూవీ ఇస్మార్ట్ శంకర్..
Nidhi Agarwal ready for marriage
రామ్ పోతినేని సరసన నటించి తన టాలెంట్ నిరూపించుకుంది. అలాంటి నిధి అగర్వాల్ గురించి తాజాగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఒక హీరోతో లవ్ లో పడిందని వీరిద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని నెట్టింటా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ హీరో ఎవరు వివరాలు చూద్దాం.. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ హీరోగా మంచి గుర్తింపు పొందిన శింబుతో ఈమె ప్రేమయానం నడిపిస్తుందని తెలుస్తోంది. (Nidhi Agarwal)
Also Read: Salman Khan: ఆ హీరోయిన్ పై సల్మాన్ ఖాన్ క్రష్.. లవర్స్ మధ్య చిచ్చు పెడతాడా.?
అయితే వీరి ప్రేమ విషయం వారి కుటుంబ సభ్యులకు కూడా తెలిసిందని, త్వరలోనే దగ్గర కుటుంబీకుల మధ్య వివాహం కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు నిధి అగర్వాల్ తను ఉండే ప్లేస్ కూడా మార్చినట్టు, శింబుకు దగ్గరగా టీ నగర్ కు ఆమె కూడా షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది.

ఈ విధంగా నిధి అగర్వాల్ శింబుతో ప్రేమాయణం నడిపిస్తున్న సమయంలోనే మరో వార్త కూడా వీరి గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమె ఓవైపు సినిమాల్లో చేస్తూ ఇంకోవైపు అసాంఘిక బెట్టింగ్ యాప్స్ కు సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అభిమానులకు మంచి సందేశం ఇవ్వాల్సిన నిధి అగర్వాల్ ఈ విధంగా బెట్టింగ్ యాప్ లకు సపోర్ట్ చేయడంతో నేటిజన్స్ మండిపడుతున్నారు.(Nidhi Agarwal)