Night Food: రాత్రి పూట మటన్ తింటున్నారా.. అయితే జాగ్రత్త ?
Night Food: ప్రజలు చాలావరకు బిజీ లైఫ్ కారణంగా ఉదయం, మధ్యాహ్నం సమయంలో ఏదో ఒకటి తిని పనిలో పడతారు. ఆఫీసులో బిజీగా ఉండడంవల్ల ఆహారంపై పెద్దగా ఆసక్తిని చూపించరు. కానీ పని అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చిన అనంతరం సాయంత్రం సమయంలో వారికి నచ్చిన ఆహారాన్ని తీసుకుంటారు. అయితే రాత్రి సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే అనారోగ్యం బారిన పడతామని పోషకాహార నిపుణులు సూచనలు చేస్తున్నారు.
Night Food Dont Eat Mutton
రాత్రి సమయంలో మటన్ తిన్నట్లయితే గుండెలో మంట పుడుతుంది. అది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దానివల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఏర్పడతాయి. నూనె పదార్థాలు, ఫ్రైడ్ ఆహారాలు రాత్రి సమయంలో తినకూడదు. అలాంటి పదార్థాలు తిన్నట్లయితే కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది. రాత్రి సమయంలో సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.
లేదంటే నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. చల్లని పానీయాలు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలు రాత్రి సమయంలో తాగకూడదు. దాని కారణంగా బరువు పెరుగుతారు. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ కలిగిన పదార్థాలు రాత్రి సమయంలో తాగకూడదు. అలా తాగినట్లయితే నిద్ర సామర్థ్యం తగ్గిపోతుంది. సిట్రస్ పండ్లను నిద్రకు ముందు అస్సలు తీసుకోకూడదు. దానివల్ల గుండెలో నొప్పి ఏర్పడే సమస్యలు వస్తాయి.