Niharika: ఉగాదికి నిహారిక రెండో పెళ్లి ఫిక్స్.. నాగబాబు ఖుషి.?
Niharika: నాగబాబు కూతురు నిహారిక రెండో పెళ్లి వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే చాలామంది హీరోయిన్లకు విడాకులు అయ్యాక మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటారు అని రూమర్లు వాళ్ళు విడాకులు తీసుకున్న తర్వాత నుండి వైరల్ అవుతూనే ఉంటాయి.అలా నిహారిక విషయంలో కూడా ఇదే జరిగింది. నిహారిక ఎప్పుడైతే జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకొని సింగిల్ గా ఉంటుందో అప్పటినుండి ఈమె రెండో పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి.

Niharika second wedding is fixed for Ugadi
కొంతమందేమో యూట్యూబర్ ని పెళ్లి చేసుకుంటుంది అంటే మరి కొంతమందేమో హీరోని పెళ్లి చేసుకుంటుందని ఇలా సోషల్ మీడియా మొత్తం మోత మోగిపోయేలా నిహారిక రెండో పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా నిహారిక రెండో పెళ్లి వార్తలపై సిని వర్గాల్లో ఒక రూమర్ వినిపిస్తోంది. ఇక ఆ రూమర్ నిజమైతే గనక మెగా ఫ్యామిలీలో మరో శుభకార్యం జరగబోతున్నట్టే.(Niharika)
Also Read: GV Prakash divorce: ఆ హీరోయిన్ కోసమే భార్యకు విడాకులు.. స్పందించని జీవీ!!
మరి ఇంతకీ నిహారిక పెళ్లి వార్తల్లో ఉన్న గుడ్ న్యూస్ ఏంటంటే.. ఉగాది తర్వాత నిహారిక పెళ్లి చేయాలని మెగా బ్రదర్ నాగబాబు నిర్ణయం తీసుకున్నారట.అయితే గత ఏడాది నిహారిక జాతకం అంత బాగోలేదని ఉగాది వచ్చాక కొంత పంచాంగం లో నిహారిక జాతకం చూపించి వెంటనే ఆమెకు పెళ్లి చేసేయాలి అనే ఆలోచన చేస్తున్నారట నాగబాబు.

ఇప్పటికే సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ ఎదుర్కొనే ట్రోలింగ్ చాలు ఇక నిహారిక విషయంలో కూడా ట్రోలింగ్ ఎదుర్కోవడం నావల్ల కాదు అని నాగబాబు తన ఇంట్లో ఈ విషయం తేల్చి చెప్పేసారట. ఇక నిహారిక కూడా పెళ్లికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే నిహారిక రెండో పెళ్లి చేసుకోబోయేది తన ఫ్రెండ్ నే అని, చిన్నప్పటినుండి తనతో కలిసి పెరిగిన ఫ్రెండ్ నే నిహారిక తన రెండో భర్తగా ఎంచుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.(Niharika)