Niharika: మాజీ భర్త వైపు మొగ్గు చూపుతున్న నిహారిక.. విడాకులు రద్దు చేసుకుంటుందా.?
Niharika: ఏంటి నిహారిక మళ్ళీ మాజీ భర్త పై మోజు పడుతోందా.. ఇంతకీ నిహారిక ఏం మాట్లాడింది.. ఆమె మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. మెగా డాటర్ నిహారిక పెద్దలు కుదిర్చిన జొన్నలగడ్డ చైతన్య సంబంధాన్ని ఒప్పుకొని పెళ్లికి ముందు కొద్ది రోజులు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. అయితే నాగబాబు తన ఒక్కగానొక్క ముద్దుల కూతురి కోసం డబ్బు భారీగా ఖర్చుపెట్టి పెళ్లి గ్రాండ్ గా చేశారు.

Niharika who is obsessed with her ex-husband
కానీ పెళ్లయిన రెండేళ్లకే నిహారిక మొత్తం చెడగొట్టేసింది.తనకి ఫ్రీడమ్ ఉండడం లేదని, అక్కడ బానిసలాగా ఉంటున్నట్లు ఫీలయ్యి వెంటనే భర్తతో విభేదాలు పెట్టుకొని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చేసింది. ఇక విడాకులు తీసుకోవడానికి రెడీ అయిన సమయంలో ఇంట్లో వాళ్ళు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో కూతురు సంతోషాన్ని కాదనలేక నాగబాబు కూడా విడాకులు తీసుకోవడానికి ఒప్పుకున్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన మాజీ భర్త పై తన విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేసింది నిహారిక. (Niharika)
ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విడాకులు తీసుకోవడం ఓ సరదా అనుకుంటారు. కానీ ఏ స్త్రీ కైనా సరే విడాకులు తీసుకోవడం ఒక బాధే. వాళ్లు సెలబ్రిటీలు అయినా సరే వారికి మాత్రం బాధ ఉండదా.. అనుకోని పరిణామాల వల్ల కొన్ని అదుపుతప్పి విడాకులకు దారి తీస్తాయి. అయినా పెళ్లికి ముందు ఎవరు కూడా విడాకుల గురించి ఆలోచన చేయరు కదా.. కొన్ని అనివార్య కారణాలవల్ల ఇష్టం లేకపోయినా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అంటూ తన విడాకులపై స్పందించింది నిహారిక.

ఇక నిహారిక మాటలు విన్న చాలా మంది నెటిజన్లు విడాకులు తీసుకున్నందుకు ఇప్పుడు బాధగా అనిపిస్తుందా.. ఇప్పుడు తప్పు తెలిసి వచ్చిందా..మళ్లీ మాజీ భర్త వైపు ప్రేమ పెరిగిపోతుందా..అంటూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే నిహారిక ఎలాంటి కామెంట్లు చేసిన ఎలాంటి పోస్టులు పెట్టినా కూడా ఈ మధ్యకాలంలో ఆమెపై ట్రోల్స్ చేయడం ఎక్కువైపోయాయి. దాంతో నిహారిక మాట్లాడిన ఈ మాటలపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.(Niharika)