Nithiin: ఐటెం సాంగ్ లో అసభ్యత.. నాకు సంబంధం లేదంటూ పెద్ద పెంట చేసిన నితిన్.?

Nithiin: హీరో నితిన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఆయన సినిమాలు హిట్ అయినా ప్లాప్ అయినా ఇండస్ట్రీలో మాత్రం ఓ మోస్తారుగా దూసుకుపోతున్నారు. కేవలం సినిమాల్లోనే కాకుండా నిర్మాతగా కూడా ఆయన వ్యవహరిస్తారు. అలాంటి నితిన్ ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఒక హిట్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా చేసినటువంటి మూవీ రాబిన్ హుడ్ త్వరలో రిలీజ్ కాబోతోంది.
Nithiin says I have no connection that song
ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల కథానాయకగా చేస్తోంది. ఈ మూవీకి వెంకీ కుడుముల డైరెక్షన్ చేస్తున్నారు. ఈ సినిమా మార్చి 28 రిలీజ్ కాబోతున్న సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇదే తరుణంలో ఈ సినిమా గురించి ఒక నెగిటివ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటో చూద్దామా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి ఒక స్పెషల్ సాంగ్ మంచి క్రేజ్ సంపాదించుకుంది.. (Nithiin)
Also Read: Venu Swamy: ఆ హీరో తో పాటు సమంత సూసైడ్..ప్రభాస్ కి ప్రాణ గండం.. లీకైన వేణు స్వామి ఆడియో.?
అంతేకాదు ఆ పాటలో కేతిక శర్మ వేసిన స్టెప్పులు కూడా కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. అంత సీనియర్ కొరియోగ్రాఫర్ అయినటువంటి శేఖర్ మాస్టర్ ఇలాంటి స్టెప్స్ ఎలా పెట్టించారని కొంతమంది నేటిజన్స్ విమర్శిస్తున్నారు. దీనిపై తాజాగా హీరో నితిన్ స్పందించి పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. నేను ఈ సాంగ్ షూట్ చేసే సమయంలో సెట్స్ లో లేనని, అది నాకు తెలియకుండానే జరిగిందంటూ చెప్పుకొచ్చారు.

ఇందులో మంచైనా చెడైనా మా చిత్ర యూనిట్ మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందని అన్నారు. ఏదైనా తప్పుగా అనిపిస్తే కాస్త అర్థం చేసుకోండి అంటూ చెప్పుకోచ్చారు. ఏది ఏమైనా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నేను ఆశిస్తున్నాను అంటూ ఆయన అన్నారు. ఈ చిత్రమైన నితిన్ కెరియర్ ను గాడిలో పెడుతుందా లేదంటే ప్లాపుల లిస్టులోనే పడేస్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.(Nithiin)