Nithya Menen: మీదిమీదికి వచ్చి అలా చేస్తాడు..ధనుష్ పై నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్..?


Nithya Menen: నిత్యామీనన్ చూడటానికి చాలా పొట్టిగా ఉన్న నటన మాత్రం చాలా గట్టిగా ఉంటుందని చెప్పవచ్చు.. కేవలం కళ్ళతోనే అన్ని హావా భావాలను ప్రదర్శించగల మేటినటి.. ఇలాంటి నిత్యామీనన్ తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్ లో కూడా మంచి ఆదరణ పొంది దూసుకుపోతోంది. ఓల్డ్ పాత్రలంటే దూరంగా ఉండే నిత్యామీనన్ ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా మాట్లాడుతుంది. ఎవరైనా తనని ఇబ్బంది పెడితే డైరెక్టుగా మీడియా ముందు చెప్పేస్తుంది.

Nithya Menen shocking comments on Dhanush

Nithya Menen shocking comments on Dhanush

అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ధనుష్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్లు చేసిందని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ మాటలు ఏంటి? ఆ వివరాలు ఏంటో చూద్దామా..నిత్యామీనన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా సక్సెస్ అనేది అందులో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి వర్తిస్తుందనీ మాట్లాడతారు గౌరవిస్తారు కానీ.. సెట్స్ లోకి మేము పెద్ద హీరోలను అనే ఈగోను చాలా వరకు ప్రదర్శిస్తూ ఉంటారు.. ఇలా పైకి మాట్లాడే మాటలకు వారు ప్రవర్తించే తీరుకు చాలా డిఫరెంట్ ఉంటుందని చెప్పుకొచ్చింది.. (Nithya Menen)

Also Read: Umair Sandu: హీరో హీరోయిన్ విడాకులు.. ఉమైర్ సందు షాకింగ్ ట్వీట్.?

ఈ మాటలను చాలామంది నెటిజెన్స్ ఈమె ఇన్ డైరెక్ట్ గా స్టార్ హీరో ధనుష్ నే అంటుందని అంటున్నారు.. ఇక మరికొందరు ఆయనను కాదు ఆమె ఇంకెవరినో మనసులో పెట్టుకొని మాట్లాడుతుందని చెప్పుకొస్తున్నారు. ధనుష్ అంటే నిత్యామీనన్ కు చాలా గౌరవమని, వారిద్దరూ మంచి స్నేహితులని చెప్పుకొస్తున్నారు.. అయితే ధనుష్ అప్పట్లో నిత్యా విషయంలో సానుకూలంగా స్పందించినటువంటి కొన్ని ట్వీట్లను, ఈ మాటలకు జతచేస్తూ చూపిస్తున్నారు.

Nithya Menen shocking comments on Dhanush

అంతేకాదు తమిళ్ లో ‘తిరుచిత్రంబలం’ అనే పేరుతో విరుదైన ఈ సినిమా తెలుగులో ‘తిరు’ గా వచ్చింది. అయితే ఈ చిత్రంలో ధనుష్ కు ఫ్రెండ్ పాత్ర పోషించిన ఆమెకు ఏకంగా నేషనల్ అవార్డు రావడంతో ధనుష్ చాలా సంతోషపడ్డారని చెప్పుకొస్తున్నారు. విధంగా ఇద్దరి మధ్య అంత స్నేహం ఉంటే ఆమె ధనుష్ ను అలా ఎందుకంటుందంటూ కామెంట్లు పెడుతున్నారు.. నిత్యా అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె ఎవరిని ఉద్దేశించి అంటోంది అనేది తెలియక చాలామంది నెటిజన్స్ తలలు పట్టుకుంటున్నారు.(Nithya Menen)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *