Nithya Menen: దానికి ఒప్పుకోలేదని అవకాశాలివ్వలేదు.. అవమానించారు – నిత్యా మీనన్!!


Nithya Menen: తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా రాణించాలంటే సాంప్రదాయంగా అందం, శరీర ఆకృతి, గ్లామర్ వంటి అంశాలపై ఆధారపడతారు. కానీ ఈ స్టీరియోటైప్ (Stereotype)‌ను ధైర్యంగా ఎదుర్కొని, కేవలం తన టాలెంట్ (Talent) ఆధారంగా టాప్ యాక్ట్రెస్‌గా ఎదిగిన మలయాళ బ్యూటీ నిత్యామీనన్ (Nithya Menen) ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. ‘అలా మొదలైంది’ (Ala Modalaindi) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె, కొద్ది కాలంలోనే ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం పొందింది.

Nithya Menen talks about body shaming

తొలినాళ్లలో ఆమెపై వచ్చిన విమర్శలు తక్కువవే కావు. “నీవు హీరోయిన్‌గా పనికిరావు”, “నీ జుట్టు వింతగా ఉంది”, “నీ లుక్స్ తక్కువగానే ఉన్నాయి” అంటూ పలువురు కామెంట్స్ చేశారు. స్కూల్, కాలేజ్ రోజుల్లో తన ringlet hair, chubby look, bold eyebrows పై ఎప్పటికప్పుడు కామెంట్లు వచ్చేవని నిత్యా ఇటీవల చెప్పింది.

అయితే ఈ కామెంట్స్‌ను తాను హార్ట్‌ఫుల్‌గా తీసుకోకుండా, సవాలుగా తీసుకుని తన నటనా ప్రతిభను నిరూపించుకుంది. టాలెంట్ ఉన్నవారికి శారీరక ఆకృతికి సంబంధం లేదు అని నిత్యా తన కెరీర్ ద్వారా స్పష్టంగా చాటిచెప్పింది. తాజాగా ‘తిరు’ (Thiru) అనే మలయాళ చిత్రానికి గాను ఆమె జాతీయ అవార్డు (National Award) గెలుచుకుంది.

ప్రస్తుతం నిత్యామీనన్ తమిళ హీరో ధనుష్‌తో కలిసి ‘ఇడ్లీ కడై’ (Idli Kadai) అనే సినిమాలో నటిస్తోంది. ఎప్పుడూ కథకు ప్రాధాన్యత ఇస్తూ, ఆలోచనాత్మక పాత్రలనే ఎంచుకుంటున్న నిత్యా, తన బలమైన వ్యక్తిత్వంతో నేటి తరం నటీమణులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *