Nithya Menen: తమిళ్ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్లు చేసిన నిత్యమీనన్.. చిన్న చూపు అంటూ.?
Nithya Menen: హీరోయిన్ నిత్యామీనన్ హైట్ తక్కువగా ఉన్నా కానీ తన అంద చందాలు, ఫిజిక్ తో అద్భుతమైన సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అలాంటి నిత్యామీనన్ ఇండస్ట్రీలో చాలా ఓపెన్ గా మాట్లాడే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఈమె పెద్ద దర్శక నిర్మాతలు ఉన్న తన మనసులో ఏం ఉంటుందో అది మాత్రమే మాట్లాడుతుంది. ఈ విధంగా ధైర్యసాహసాలు ఉన్న హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్ తాజాగా మరో విషయాన్ని కూడా తెరపైకి తీసుకువచ్చింది.
Nithya Menen who made shocking comments on the Tamil industry
ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే చిన్నచూపు ఉందని అది మారాలని హీరో, డైరెక్టర్ల తర్వాతే హీరోయిన్ ను గుర్తిస్తారని, చెప్పుకొచ్చింది.. సినిమా నడవాలంటే హీరో హీరోయిన్ డైరెక్టర్ నిర్మాత అందరూ ఉంటారు. ఇందులో హీరోయిన్లపై చిన్న చూపు పెట్టి మిగతా వాళ్ళందరిని గౌరవిస్తారని ఇదంతా మారిపోవాలని, ముఖ్యంగా టైటిల్ కార్డులో హీరో తర్వాత హీరోయిన్ పేరు వస్తుందని చెప్పుకొచ్చింది. అలాంటి దాన్ని రూపుమాపాలని నేను కోరుకుంటున్నానని, తాజాగా తను హీరోయిన్ గా చేసినటువంటి తమిళ్ మూవీ కాదలిక్క నేరమిల్లై చిత్రంలో టైటిల్ కార్డులో తన పేరే ముందుగా వస్తుందని చెప్పుకొచ్చింది. (Nithya Menen)
Also Read: Nayanthara: నయనతారకు బాగా పొగరు.. క్షమించమని కూడా అడగలేదు.?
ఇదేలా సాధ్యమని యాంకర్ ప్రశ్నించగా కోలీవుడ్ లో అందరూ ఒక పద్ధతిని పాటిస్తారు. ఈ పద్ధతి ప్రకారం ముందుగా హీరో పేరు కనిపించాలి ఆ తర్వాత డైరెక్టర్ పేరు ఎక్కడో చివర్లో హీరోయిన్ పేరు కనిపిస్తుందని చెప్పుకొచ్చింది. కేవలం టైటిల్ కార్డు విషయంలోనే కాకుండా ఏవైనా ఫంక్షన్లు జరిగినా, షూటింగ్ సమయంలో కూడా హీరో చేసిన యాక్టింగ్ కే చప్పట్లు కొడతారు. హీరోయిన్ ఎంత బాగా చేసిన అందరు సైలెంట్ గానే ఉంటారు అంటూ అన్నది.
అలాంటి దాన్ని రూపుమాపాలని నేను డిసైడ్ అయ్యానని అందుకే కాదలిక్క నేరమిల్లయ్ చిత్రం టైటిల్ కార్డు లో తన పేరు మొదటగా వస్తుందని దానికి హీరో జయం రవి కూడా సహకారం అందించారని చెప్పుకొచ్చింది. ఇదే హీరోయిన్ల చిన్నచూపును రూపుమాపడంపై మొదటి అడుగు అన్నది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు సపోర్టుగా నిలుస్తున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.(Nithya Menen)