Nitish Kumar Reddy: నితీష్ ఫేవరేట్ హీరో ఎవరు.. ప్రియురాలు ఆమేనా ?

Nitish Kumar Reddy: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ లో అదిరిపోయే సెంచరీ సాధించాడు నితీష్ కుమార్ రెడ్డి. క్రికెట్ ప్రపంచంలో ఇతను ఓ సెన్సేషన్ గా మారుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో పుట్టి పెరిగిన నితీష్ రెడ్డి తన ఐదవ ఏట నుంచి క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. తన కుమారుడు నితీష్ కుమార్ రెడ్డి క్రికెట్ కోసం అతని తండ్రి తన ఉద్యోగాన్ని త్యాగం చేశాడు. అండర్-12, అండర్-14 గ్రూప్ మ్యాచుల సమయంలో మాజీ క్రికెటర్ ఎమ్మెస్ కే ప్రసాద్… నితీష్ రెడ్డి లోని టాలెంట్ ను గుర్తించి ట్రైనింగ్ నిమిత్తం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు తరలించాడు. Nitish Kumar Reddy

nitish kumar reddy favorite hero

2023లో ఐపిఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ నితీష్ కుమార్ రెడ్డిని రూ. 20 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. ఇక 2024లో ఆ ప్రాంచైజీకి స్టాండ్ అవుట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు నితీష్ కుమార్ రెడ్డి. బంగ్లాదేశ్ తో టీ20లకు ఎంపికైన నితీష్ కుమార్ రెడ్డి అనంతరం ఆల్ రౌండర్ స్థానంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ద్వారా టెస్టుల్లోకి టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. కాగా, ఈ క్రమంలోనే నితీష్ కుమార్ రెడ్డి ఫేవరెట్ హీరో ఎవరు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నితీష్ కుమార్ రెడ్డి ఫేవరెట్ హీరో ఎవరో కాదు టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. Nitish Kumar Reddy

Also Read: Hot Water Bath: వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా.. ఈ జబ్బు రావడం ఖాయం ?

తాను మహేష్ బాబుకు వీరాభిమానినని చాలా సందర్భాలలో నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు. తన నాన్న కృష్ణ అభిమాని అని, పోకిరి సినిమా నుంచి తాను మహేష్ బాబును ఫాలో అవుతున్నానని నితీష్ కుమార్ రెడ్డి వెల్లడించాడు. మహేష్ సినిమాలు తనకు ఎంతో స్ఫూర్తిని ఇస్తాయని నితీష్ చెప్పాడు. నితీష్ మెల్ బోర్న్ లో హాఫ్ సెంచరీ చేసిన అనంతరం పుష్ప స్టైల్ సెలబ్రేషన్ చేస్తే, సెంచరీ చేసుకున్నాక సలార్ స్టైల్ సెలబ్రేషన్ చేసి గ్రౌండ్ లో వైల్డ్ ఫైర్ పూనకాలు తెప్పించాడు నితీష్ రెడ్డి. నితీష్ కు లవ్ లాంటివి లేవని అంటున్నారు. Nitish Kumar Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *