Nivetha Pethuraj: పాగల్, దాస్ కా ధమ్ కీ,బ్రోచేవారెవరురా, మెంటల్ మదిలో, చిత్రలహరి వంటి సినిమాల ద్వారా టాలీవుడ్లోకి అరంగేట్రం చేసింది నటి నివేతా పేతురాజ్.ఈమె తెలుగులో అల్లు అర్జున్ తో అల వైకుంఠపురం సినిమాలో కూడా నటించింది.కానీ ఈ సినిమా అంతగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. అయితే తాజాగా ఈ హీరోయిన్ పరువు అనే వెబ్ సిరీస్ లో చేసిన సంగతి మనకు తెలిసిందే. సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ వెబ్ సిరీస్లో నాగబాబు కూడా కీలకపాత్రలో చేశారు.
Nivetha Pethuraj who failed in love
అయితే ఈ వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ రావడంతో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ నివేద పేతురాజ్ ఎన్నో విషయాలు చెప్పుకొస్తుంది.ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలో పాల్గొని నివేద పేతురాజ్ కి షాకింగ్ ప్రశ్న ఎదురైంది.అదేంటంటే.. మీకు గతంలోకి గనుక వెళ్లే అవకాశం వస్తే మీకు మీరు ఎలాంటి సలహాలు, సూచనలు ఇచ్చుకుంటారు అని యాంకర్ అడగగా..(Nivetha Pethuraj)
Also Read: Prabhas: ప్రభాస్ మీద పగతో కల్కి మూవీని రిజెక్ట్ చేసిన హీరోయిన్.. ఎవరంటే..?
ఒక అబ్బాయి తో డేటింగ్ చేసే ముందు ఫ్రెండ్షిప్ చేయాలి.అంతకంటే ముందు ఆ అబ్బాయి ఎలాంటి వాడు అనే విషయం పూర్తిగా తెలుసుకోవాలి అని చెప్పింది. అయితే అడిగిన ప్రశ్నకి సంబంధం లేకుండా ప్రేమ, డేటింగ్ గురించి మాట్లాడేసరికి అందరికీ అనుమానం వచ్చింది. అయితే ఈ అనుమానంతోనే యాంకర్ కూడా మీకు గతంలో ఎవరైనా లవర్ ఉన్నారా.. లవ్ ఫెయిల్యూర్ అయిందా అని అడగగా..
ఇప్పుడు ఒంటరిగా ఎవరు ఉంటున్నారు. సింగిల్ గా ఉండడం అంటే భయపడుతున్నారు. ఈ రోజుల్లో లవ్, డేటింగ్ అనేది కామనే అంటూ చెప్పింది. దీంతో నివేదా పేతురాజ్ లవ్ ఫెయిల్యూర్ అని,ఆమె గతంలో అబ్బాయి ప్రేమలో మోసపోయింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈమె సినిమా ఇండస్ట్రీకి వచ్చాక కూడా ఓ యంగ్ హీరోతో ప్రేమలో ఉందనే రూమర్ వినిపించింది.కానీ ఈ మధ్యకాలంలో ఆ హీరోని కాస్త దూరం పెడుతున్నట్టు తెలుస్తుంది.(Nivetha Pethuraj)