Champions Trophy 2025: గాయాల బెడద…బుమ్రా లేకుండా టీమిండియా గెలుస్తుందా?


Champions Trophy 2025: ఛాంపియన్ ట్రోఫీ హడావిడి మొదలైనప్పటి నుంచి ఆటగాళ్లు అందరూ గాయాల బారిన పడుతున్నారు. అన్ని జట్లు ఇందులో చేరుతున్నాయి. రోజుకో ఆటగాడు గాయంతో జట్టు నుంచి తప్పుకుంటున్నాడు. ఇప్పుడ మరో ప్లేయర్‌ కు గాయం అయింది. భారత క్రికెట్ జట్టు కూడా ఈ గాయాల తుఫాను నుంచి తనను తాను రక్షించుకోలేకపోతోంది. గాయం కారణంగా వెటరన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో భాగమైన మరో ముఖ్యమైన బౌలర్ గాయపడ్డాడు. ఇంగ్లాండ్ తో జరిగే మూడో వన్డేకి ముందు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి కాలు వాపు వచ్చిందని వార్తలు వస్తున్నాయి.

no Bumrah in teamindia over Champions Trophy 2025

పూర్తిగా ఫిట్ గా లేకపోవడంతో ప్లేయింగ్ XI లో చేర్చలేదు. టాస్ సమయంలో రోహిత్ మాట్లాడుతూ, చక్రవర్తి కాలులో స్వల్ప మార్పు కారణంగా ఈ మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఏలెవన్ లో అతనిని చేర్చలేదని చెప్పాడు. మూడో వన్డే కోసం భారత్ తమ ప్లేయింగ్ ఏలేవన్ లో మూడు మార్పులు చేసింది. మిగతా ఇద్దరు ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. చక్రవర్తి ఫిట్నెస్ లేకపోవడం భారతదేశానికి ఆందోళన కలిగించే విషయం కావచ్చు. ఎందుకంటే భారత జట్టు గాయం కారణంగా ఇప్పటికే పెద్దదబ్బను చవి చూసింది. 2021 తర్వాత కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ రాకతో చక్రవర్తి తొలిసారిగా టీ 20 అంతర్జాతీయ మ్యాచ్లకు తిరిగివచ్చాడు.

IPL 2025: RCBకి ఎదురుదెబ్బ… ఆ ప్లేయర్ అవుట్ ?

ఈ ఫార్మాట్లో నిలకడగా మంచి ప్రదర్శన ఇచ్చిన తర్వాత చక్రవర్తిని ఆకస్మాత్తుగా వన్డే జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేకి ముందు చక్రవర్తి జట్టుతో కలిసి శిక్షణ పొందాడు. తాజాగా టీమిండియాలోకి వచ్చాడు. బూమ్రా స్థానంలో వచ్చిన తొలి వన్డేలో అవకాశం లభించకపోవడంతో రెండో వన్డేలో అరంగేట్రం చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చక్రవర్తి, హర్షిత్ రానా స్థానంలో బూమ్రా, యశస్వి జైస్వాల్ చోటు దక్కించుకున్నారు. గాయం కారణంగా బూమ్రా జట్టుకు దూరంగా ఉండగా…. అతనికి చోటు కల్పించడానికి యశస్విని జట్టు నుంచి తొలగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *