Champions Trophy: సెలెబ్రేషన్స్ లేవు.. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి బస్సు పరేడ్ లేకుండానే రోహిత్ సేన.. కారణం ఇదే!!

Champions Trophy: టీమిండియా 12 ఏళ్ల తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి 25 ఏళ్ల కిందటి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (76 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్ ఆడుతూ టీమిండియాను గెలిపించాడు. కివీస్ ఓపెనర్ రచిన్ రవీంద్ర ఈ టోర్నమెంట్‌లో రెండు సెంచరీలు, కీలక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు.
No Bus Parade for Champions Trophy
అభిమానులు టీ20 వరల్డ్‌కప్‌లా గ్రాండ్ సెలెబ్రేషన్స్ కోసం ఎదురు చూశారు. కానీ, ఆటగాళ్లు విడివిడిగా భారత్‌కు చేరుకున్నారు. రోహిత్ శర్మ తన కుటుంబంతో ముంబయికి చేరుకోగా, హార్దిక్ పాండ్యా కూడా ముంబయిలో ల్యాండ్ అయ్యాడు. రవీంద్ర జడేజా చెన్నై చేరుకోగా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ వెళ్లాడు. విరాట్ కోహ్లీ, అర్షదీప్ సింగ్ మాత్రం దుబాయ్‌లోనే ఉన్నారు.
మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కావడంతో ఆటగాళ్లు తమ షెడ్యూల్ ప్రకారం ప్రయాణిస్తున్నారు. 2013లో ధోనీ సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు కూడా బీసీసీఐ బస్సు పరేడ్ నిర్వహించలేదు. వన్డే, టి20 వరల్డ్‌కప్‌లకు మాత్రమే గ్రాండ్ సెలెబ్రేషన్స్ ఉంటాయని బీసీసీఐ స్పష్టం చేసింది.