Naga Babu: నాగబాబుకు నో ఛాన్స్… రిజెక్ట్ చేసిన చంద్రబాబు నాయుడు?
Naga Babu: మెగా బ్రదర్ నాగబాబుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనకు మంత్రి పదవి రాకుండా కొంతమంది తెలుగు తమ్ముళ్లు అడ్డుకుంటున్నారట. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి వస్తుందని మొన్నటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. Naga Babu

No chance for Nagababu Chandrababu Naidu rejected
అయితే ఈ వార్తల నేపథ్యంలో… మెగా బ్రదర్ నాగబాబు కు సినిమాటోగ్రఫీ లేదా పర్యాటకశాఖ ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ నెల చివర్లో అంటే కొత్త సంవత్సరం వచ్చే లోపు నాగబాబుకు మంత్రి పదవి వస్తుందని చెబుతున్నారు. ఎమ్మెల్సీ పదవి మొదటగా ఇచ్చి ఆ తర్వాత…. మంత్రి చేయబోతున్నారట. Naga Babu
Also Read: WTC: టీమిండియా WTC చేరాలంటే… ఇలా జరగాల్సిందే ?
అయితే ఇలాంటి నేపథ్యంలో… మెగా బ్రదర్ నాగబాబు కు తెలుగు తమ్ముళ్లు ఊహించని షాక్ ఇచ్చారట. నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చేది లేదని చంద్రబాబు నాయుడుకు… తెలుగు తమ్ముళ్లు కొంతమంది విజ్ఞప్తి చేశారట. గతంలో తెలుగుదేశం పార్టీ నేతల పైన నాగబాబు విమర్శలు చేశాడని.. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నారట. దీనిపై చంద్రబాబు పునర్ ఆలోచనలో పడ్డారట. Naga Babu