Nokia G42 5G: ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారు. మార్కెట్లోకి కొత్త కొత్త ఫోన్స్ కూడా వస్తున్నాయి. ఒకప్పుడు ఫీచర్ మొబైల్స్ తో మార్కెట్లో తనదైన ముద్రవేసిన నోకియా తర్వాత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అంతలా రాణించలేదు. అయితే విండోస్ ఫోన్లను విడుదల చేసినా అవి పెద్దగా క్లిక్ అవ్వట్లేదు. దీంతో నోకియా కూడా స్మార్ట్ఫోన్ రంగంలోకి వచ్చింది. తాజాగా అమెజాన్ లో నోకియా జీ42 ఫోన్ పై భారీ డిస్కౌంట్ ని అందిస్తోంది నోకియా జీ42 పేరుతో 5G ఫోన్ ని నోకియా తీసుకురావడం జరిగింది. తక్కువ ధరలో 5G ఫోన్ కోసం చూస్తున్న వాళ్ళు దీనిని కొనుగోలు చేయొచ్చు.

Nokia G42 5G phone details

అమెజాన్ లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఉంటుంది ఇంతకీ ఫోన్ ధర ఎంత..? దీని ఫీచర్స్ ఏంటనేది చూడాలా..? మరి ఇప్పుడు చూసేయండి. ఈ ఫోన్ ధర వచ్చేసి 12,999 అమెజాన్ లో 23% డిస్కౌంట్తో 9999కి సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ పే బ్యాలెన్స్ తో పే చేసేవాళ్ళు 300 క్యాష్ బ్యాక్ ని పొందవచ్చు. ఈ ఫోన్ ని మీ పాత ఫోన్ తో ఎక్స్చేంజ్ చేసుకుంటే 9,450 వరకు డిస్కౌంట్ వస్తుంది. ఇక ఫీచర్ల గురించి చూస్తే 6.5 ఇంచెస్ తో కూడిన డిస్ప్లే ఇచ్చారు.

Also read: Aditi Agarwal: గంగోత్రి మూవీ హీరోయిన్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ హీరో నేనా…?

5000mah బ్యాటరీ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ థర్టీన్ ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్ పనిచేస్తుంది. లిథియం పాలిమర్ బ్యాటరీని అందించారు. బ్లూటూత్ వైఫై యూఎస్బీ 3.5 ఎమ్ ఎమ్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇచ్చారు, ఒకసారి ఛార్జ్ చేస్తే 26 గంటల వరకు ఇది బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. ఫోన్ బరువు వచ్చేసి 194 గ్రాములుగా ఉంది కెమెరా విషయానికొస్తే 50 మెగా పిక్సెల్స్ తో కూడిన ట్రిపుల్ కెమెరా ఇచ్చారు. మూడేళ్లు సెక్యూరిటీ అప్డేట్స్ రెండేళ్లు ఆండ్రాయిడ్ మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ వారెంటీ ఇచ్చారు (Nokia G42 5G).