NTR And Hrithik Roshan: చరణ్ తో సెట్ అయినట్లు హృతిక్ తో వర్కౌట్ అయ్యేనా తారక్?
NTR And Hrithik Roshan: “నాటు నాటు” పాటతో ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టించారు. సంగీతం, డాన్స్, మరియు ప్రదర్శనతో ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ను కూడా ఈ పాట విశేషంగా ఆకట్టుకుంది. అంతేగాక, ఈ పాటకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు రావడం, తెలుగు సినిమాను గ్లోబల్ మ్యాప్‌పై ఉంచింది.
NTR And Hrithik Roshan Dance in WAR 2
ఇప్పుడు అదే మేజిక్‌ను బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి “వార్ 2″లో పునరావృతం చేయబోతున్నారు. ఇండియాలోనే బెస్ట్ డాన్సర్స్‌గా పేరు తెచ్చుకున్న వీరి జోడీ థియేటర్లను కదిలించే రేంజ్‌లో ఉంది. “వార్ 2” కోసం మ్యూజిక్ డైరెక్టర్, వీరి ఎనర్జీని మ్యాచ్ చేసేలా స్పెషల్ ట్యూన్ కంపోజ్ చేసినట్లు సమాచారం. హృతిక్, ఎన్టీఆర్ కలిసి డాన్స్ చేయడం అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించనుంది.
“వార్ 1″లో హృతిక్, టైగర్ ష్రాఫ్ కలిసి చేసిన డాన్స్ నెంబర్ సినిమా విజయానికి కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు “వార్ 2″లో ఆ కంటే గ్రాండ్‌గా, డాన్స్ మూమెంట్స్ విషయంలో మరింత స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని టాక్. ఈ సాంగ్ మాత్రమే కాకుండా, మొత్తం సినిమానే ప్రేక్షకుల అంచనాలను మించేలా తీర్చిదిద్దుతున్నారు.
హృతిక్-ఎన్టీఆర్ కాంబినేషన్‌తో “నాటు నాటు” స్థాయి మ్యాజిక్ రిపీట్ అవుతుందా అనే ఉత్సుకత ప్రేక్షకుల్లో నెలకొంది. టాప్ డాన్సర్స్ కలిసిన ఈ క్రేజీ కాంబోపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. త్వరలో “వార్ 2” నుండి ఫస్ట్ లుక్ రివీల్ కానుంది.