Prashanth Neel Film: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీలో తారక్ పాత్ర ఎలా ఉండబోతోందో తెలుసా?
Prashanth Neel Film: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల బ్లాక్‌బస్టర్ హిట్ “దేవర”తో తన మార్కును మరోసారి నిరూపించుకున్నాడు. ఈ విజయం తర్వాత ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ “వార్ 2″పై ఆసక్తి నెలకొంది. అయితే, ఈ సినిమా కంటే పెద్ద అంచనాలు ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్‌పై ఉన్నాయి. ఈ సినిమా ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేసింది.
NTR Grey Role in Prashanth Neel Film
ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తారక్ పాత్రకు గ్రే షేడ్స్ ఉండనున్నాయని సమాచారం. ఆయన కనికరం లేని, మొరటు స్వభావం కలిగిన పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నారని టాక్. తారక్ పాత్ర చాలా ఇంటెన్స్ గా, హై ఎమోషన్ తో ఉండబోతుందని చెప్తున్నారు. ఈ కొత్త మేకోవర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
ఇప్పటికీ షూటింగ్ ప్రారంభం కాకపోయినప్పటికీ, ఈ చిత్రానికి సంబంధించి భారీ బడ్జెట్ ఖర్చు చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టాయి. ఎక్కడా రాజీ పడకుండా ఈ ప్రాజెక్ట్‌ను గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. సినిమా చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంలో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సెన్సేషన్ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో వెల్లడికానున్నాయి.