Ongole Breed Cow: ఒంగోలు జాతి ఆవు ధర రూ.41 కోట్లు
Ongole Breed Cow: మన భారత దేశంలో రకరకాల ఆవులు గేదలు ఉంటాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా ఆవులు ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే కొన్ని ఆవులు ఎక్కువగా పాలను ఇస్తాయి. మరికొన్ని ఆవులు చాలా తక్కువగా పాలు ఇస్తాయి. పాలు ఇచ్చే ఆవులను బట్టి వాటి ధర ఉంటుంది. సాధారణంగా ఆవు ధర వేలల్లో ఉంటుంది.

Ongole breed cow priced at Rs 41 crore
కాస్త ఎక్కువగా పాలు ఇచ్చే ఆవులకైతే ఒకటి నుంచి రెండు లక్షలుగా ధర ఉంటుంది. అయితే నెల్లూరు, ఒంగోలు బ్రీడ్ కు చెందిన వయాటినా-19 అనే ఆవు బ్రెజిల్ లో నిర్వహించిన వేలంలో ఏకంగా రూ. 41 కోట్లకు అమ్ముడు పోవడం గమనార్హం. దీంతో గతంలో ఉన్న రికార్డులు అన్ని ఒక్కసారిగా తారుమారు అయ్యాయి.
కాగా, 1800s లో ఒంగోలుకు చెందిన ఈ ఆవును బ్రెజిల్ కి తీసుకువెళ్లారు. అక్కడ అనేక జెనెటిక్ మార్పులతో ఈ ఆవు ప్రాచుర్యం పొందింది. వయాటినా-19 బరువు ఏకంగా 1,101 కేజీలు ఉంది. ఈ ఆవును చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.