Onion: ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో తప్పకుండా ఉల్లిపాయ ఉంటుంది. ఉల్లిపాయ లేని కూర అస్సలు చేయరు. అయితే పచ్చి ఉల్లిపాయ తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉల్లిపాయపై నిమ్మరసం కనుక పిండుకొని తిన్నట్లయితే ఊహించని ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. Onion
Onion Health Benfits
ఉల్లిపాయను నిమ్మరసంలో నానబెట్టి తిన్నట్లయితే రక్తంలోని చక్కెరస్థాయిలు వేగంగా అదుపులోకి వస్తాయి. ఇలా తినడం వల్ల రక్తంలోని చక్కెరను నియంత్రించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా షుగర్ బాధితులు పచ్చి ఉల్లిపాయను తరచుగా తినడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ప్రతిరోజు సలాడ్ లో పచ్చి ఉల్లిపాయను తీసుకొని అందులో నిమ్మరసం పిండుకొని తింటే మంచి ఫలితాలు ఉంటాయి. Onion
Also Read: Deepthi Jeevanji: దీప్తి జివాంజీకి సీఎం రేవంత్ బంపర్ ఆఫర్ !
డయాబెటిక్ రోగులకు నిమ్మరసంలో నానబెట్టిన ఉల్లిపాయను తింటే అది ఒక అద్భుతమైన మందుగా పని చేస్తుంది. నిమ్మరసంలో కనుక ఉల్లిపాయను తింటే మన శరీరంలోని జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఉల్లిపాయను సలాడ్, వెజిటబుల్ గ్రేవీ, చట్నీ వంటి ఎలాంటి వాటిలోనైనా కలుపుకుని తినవచ్చు. Onion
దీనివల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉల్లిపాయల్లో క్రోమియం, సల్ఫర్ ఉంటాయి. నిమ్మరసంలో విటమిన్ సి, విటమిన్ ఎ ఉంటాయి. ఈ రెండింటిని కలుపుకొని తిన్నట్లయితే ముఖ్యంగా షుగర్ బాధితులకు చాలా మంచిది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. Onion