MLA Facilities: ఎమ్మెల్యేలకు మసాజ్ కుర్చీలు.. ఒత్తిడికి మసాజ్ పరిష్కారమా? ప్రజల డబ్బుకు విలువ ఇది?


Opposition Slams Costly MLA Facilities Plan

MLA Facilities: కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేల కోసం కొత్త సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తీవ్ర చర్చకు దారితీసింది. స్పీకర్ యూటీ ఖాదర్ అసెంబ్లీలో స్మార్ట్ లాక్స్, మసాజ్ కుర్చీలు, రిక్లయినర్ సీట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎమ్మెల్యేల ఒత్తిడిని తగ్గించేందుకు, సమావేశాల్లో హాజరును పెంచేందుకు వీటిని అమలు చేస్తున్నామని స్పీకర్ చెప్పారు. అయితే, ప్రతిపక్ష బీజేపీ దీన్ని తీవ్రంగా విమర్శించింది, దీన్ని అనవసర ఖర్చుగా పేర్కొంది.

Opposition Slams Costly MLA Facilities Plan

ఈ సౌకర్యాల కోసం అంచనా వ్యయం రూ. 3 కోట్లు, ఇది ప్రజా ధన వృథా అని బీజేపీ అభిప్రాయపడింది. స్పీకర్ ఖాదర్ స్పందిస్తూ, ఎమ్మెల్యేలు ఒత్తిడిలో పనిచేస్తున్నారని, ముఖ్యంగా సీనియర్ ఎమ్మెల్యేలకు సహాయంగా ఈ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఇంకా, మసాజ్ కుర్చీలు శాశ్వతంగా కొనుగోలు చేయడం లేదని, అసెంబ్లీ సమావేశాల సమయంలో మాత్రమే వినియోగించి, తర్వాత తొలగిస్తామని అన్నారు.

బీజేపీ నేత సీటీ రవి ఈ ప్రతిపాదనను తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కోసం నిధులు లేవంటూ చెప్పే ప్రభుత్వం, ఎమ్మెల్యేల కోసం కోట్లు ఖర్చు చేయడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు నెగెటివ్‌గా స్పందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ మంత్రులు ప్రియాంక్ ఖర్గే, ఈశ్వర్ ఖండ్రే ఈ ప్రతిపాదనను సమర్థించారు. ఎమ్మెల్యేలు ఎక్కువ పని ఒత్తిడిలో ఉంటారని, ముఖ్యంగా సీనియర్ సభ్యులకు ఈ సౌకర్యాలు అవసరమని చెప్పారు. అయితే, ప్రజలు దీనిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అసెంబ్లీ కార్యకలాపాలను మెరుగుపరిచే మార్పులకు మద్దతు ఇస్తుండగా, మరికొందరు ప్రజా సంక్షేమంపై ఎక్కువగా దృష్టిపెట్టాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *