Champions Trophy: చాంపియన్స్ ట్రోఫీ కి ఉగ్ర ముప్పు.. టోర్నీ రద్దవుతుందా?

Champions Trophy: ఎన్నో అంచనాల మధ్య చాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై నిఘా వర్గాలు (intelligence sources) తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. ఈ టోర్నీ లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగే ప్రమాదముందని, ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్ ప్రావిన్స్ (ISIS-K), తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) వంటి ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో శ్రీలంక జట్టుపై 2009లో జరిగిన ఉగ్రదాడి తర్వాత, పాకిస్తాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలు నిర్వహించడం సవాలుగా మారింది.
Pakistan Champions Trophy Faces Security Threat
చాలా సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ ఐసీసీ మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వబోతోంది. తమ దేశం భద్రతా పరంగా సురక్షితం (secure venue) అని ప్రపంచానికి రుజువు చేయాలనే లక్ష్యంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కృషి చేస్తోంది. అయితే తాజా భద్రతా ముప్పు (security threat) ఆ ప్రయత్నాలను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఇప్పటికే భారత్ పాక్‌లో క్రికెట్ ఆడే విషయంలో భద్రతా కారణాలతో ఆందోళన వ్యక్తం చేసింది.
పాక్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక సెక్యూరిటీ అడ్వైజరీ విడుదల చేసింది. ఇందులో అంతర్జాతీయ క్రికెటర్లు, విదేశీ టూరిస్టులు, మరియు జట్ల బస చేసే హోటళ్లను ప్రధాన లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి చేసే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్టేడియాలు, హోటల్స్, క్రికెట్ అకాడమీల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇప్పటికే భారత క్రికెట్ బోర్డు (BCCI) పాకిస్తాన్‌లో ఆడేందుకు నిరాకరించడం తో, మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్ ద్వారా దుబాయిలో నిర్వహిస్తున్నారు. మరి ఉగ్రదాడి ఆరోపణల నేపథ్యంలో మిగితా మ్యాచ్ లు ఎలా అడతాయో చూడాలి. ఈ పరిస్థితుల నేపథ్యంలో, పాకిస్తాన్ అంతర్జాతీయ టోర్నీలు నిర్వహించే సామర్థ్యం మరోసారి ప్రశ్నార్థకంగా మారింది.