KCR: గజ్వేల్ లో పంచాయితీ…కేసీఆర్ సభ్యత్వం రద్దు కానుందా ?
KCR: గజ్వేల్ లో కేసీఆర్ గురించి పంచాయితీ కొనసాగుతోంది…కేసీఆర్ సభ్యత్వం రద్దు కానుందని అంటున్నారు. ఆ దిశగా కాంగ్రెస్ నేతలు.. స్పీకర్, గవర్నర్, సీఎం రేవంత్ కు ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలోనే… గజ్వేల్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిల్లర రాజకీయాలకు, దిగజారుడు, దివాళాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహించారు.

Panchayat in Gajwel Will KCR’s membership be cancelled
కేసీఆర్ గారికి గజ్వేల్‌కు ఉన్నది తల్లీ పిల్లల పేగుబంధం అని… కేసీఆర్ గారు గజ్వేల్‌ను తెలంగాణలో ఇతర పట్టణాలకు ఆదర్శంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. ఇవాళ వారి కృషితోనే గజ్వేల్‌ను సకల సౌకర్యాలతో అలరారే ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దారని తెలిపారు. ఒకప్పుడు గజ్వేల్ అంటే కక్షలు, కుట్రలు, భౌతిక దాడులు, పోలీస్ కేసులు ఉన్నాయని తెలిపారు. కేసీఆర్ గారొచ్చిన తర్వాత గజ్వేల్‌ను ప్రేమ, అభిమానాలకు, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా తీర్చిదిద్దారన్నారు. గజ్వేల్‌లో అనునిత్యం అభివృద్ధి, సేవా కార్యక్రమాలను కొనసాగించారని తెలిపారు.
Telangana: బాల్క సుమన్, వివేక్ వెంకటస్వామి చర్చలు ?
దేశ ప్రధానమంత్రిని కూడా గజ్వేల్‌కు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిదేనని… ఎండాకాలం వచ్చిందంటే అక్కా చెల్లెల్ల బాధలు వర్ణణాతీతం.. గజ్వేల్‌లో తాగునీటి కోసం కటకటలాడేవారని వివరించారు. ట్యాంకర్లతోపాటు, ఆటోల్లో, రిక్షాల్లో, డ్రమ్ములు పెట్టుకొని మంచినీళ్లు తెచ్చుకునే పరిస్థితి గ్రామాల్లో, గజ్వేల్ పట్టణంలో ఉండేదన్నారు. కేసీఆర్ గారు మిషన్ భగీరథను తెచ్చి మొట్టమొదలు చెల్లెళ్ల దాహార్తిని తీర్చారన్నారు. కేసీఆర్ ఎప్పుటికీ గజ్వేల్ ఎమ్మెల్యేగా కొనసాగుతారన్నారు.
KTR: దేశాలు దాటినా పోలీసులను వదిలిపెట్టను ?