Pattudala Movie: అజిత్ “విడాముయార్చి” ఓటీటీ స్ట్రీమింగ్.. ఎప్పుడు ఎక్కడ?

Pattudala Movie: తమిళ స్టార్ హీరో అజిత్ మరియు త్రిష జంటగా నటించిన “విడాముయార్చి” (Vidamuyarchi) సినిమా, ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, మొదట సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా, ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడింది. విడుదల అనంతరం, సినిమా మిక్స్‌డ్ రివ్యూలను అందుకుంది. అజిత్ సినిమాలపై భారీ అంచనాలు ఉండే కానీ, ఈ సినిమా ఆ స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది.
Pattudala Movie Telugu Version Streaming
తెలుగులో “పట్టుదల” (Pattudala) పేరుతో విడుదలైన ఈ సినిమా, మితమైన ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఇప్పుడు OTT విడుదలతో ఎక్కువ మంది వీక్షించే అవకాశం ఉంది. థియేటర్లలో సాధించిన మోస్తరు విజయంతో పాటు, డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా మరింత మంది ప్రేక్షకులను ఆకర్షించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.
సాధారణంగా, సినిమా థియేట్రికల్ విడుదలకు నాలుగు వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ అవుతుంది. కానీ, విడాముయార్చి థియేట్రికల్ రన్ తక్కువగా ఉండటంతో, నిర్మాతలు ముందుగానే OTT విడుదల చేయాలని నిర్ణయించారు. నెట్‌ఫ్లిక్స్ (Netflix) డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుని, ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 3న స్ట్రీమింగ్ చేయనుంది.
కథలో మంచి ఆసక్తికరమైన అంశాలు ఉన్నప్పటికీ, కమర్షియల్ ఎలిమెంట్స్ లోపించడం వల్ల సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయినప్పటికీ, అజిత్ స్టైల్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. OTT స్ట్రీమింగ్ ద్వారా ఈ సినిమా మరింత ప్రేక్షకాదరణ పొందుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.