Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డు వివాదం ఏపీలో కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయిందని… స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఈ వివాదం రాజుకుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు… తిరుమల శ్రీవారి లడ్డులో జంతువుల కొవ్వు వాడారని.. చంద్రబాబు నాయుడు పేర్కొనడం జరిగింది. Tirumala Laddu
Pawan Kalyan, Chandrababu apologize to Hindus
దీంతో అందరూ జగన్మోహన్ రెడ్డిని దోషిగా చూశారు. అయితే ఇదే అంశంపై సుప్రీంకోర్టుకు వైసిపి వెళ్లి సక్సెస్ అయింది. సోమవారం తిరుమల శ్రీవారి లడ్డు పైన సుప్రీంకోర్టు విచారణ జరిపి కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయినట్లు ఎక్కడ కూడా రుజువులు లేవని.. కూటమి ప్రభుత్వo పై సీరియస్ అయింది. హిందువుల మనోభావాలతో ఎలా మీరు ఆడుకుంటారని.. మండిపడింది. Tirumala Laddu
Also Read: Naga Babu: నాగబాబుకు పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్ ?
అయితే.. చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డుపై చేసిన ప్రచారం పట్ల.. సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో.. వైసిపి రంగంలోకి దిగింది. ఈ ఇద్దరు నాయకులు హిందువులకు క్షమాపణలు చెప్పాల్సిందేనని.. లేకపోతే వాళ్ళ అంతు చూస్తామని వైసిపి నేతలు హెచ్చరిస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డుని.. అపవిత్రం చేసేలా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేసిందని మండిపడుతున్నారు వైసీపీ నేతలు. ఈ విషయాన్ని జనాల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. Tirumala Laddu