Pawan Kalyan: ఉన్న సినిమాలకే దిక్కు లేదుకానీ.. పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు చేస్తాడా?


Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం రాజకీయ బాధ్యతలతో పాటు సినీ ప్రాజెక్ట్స్‌ను సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటీవలి రోజుల్లో గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో పవన్ ఒక కొత్త సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ, ఈ ప్రచారంలో నిజం లేదు. పవన్ ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ (Busy schedule) చూస్తే, కొత్త సినిమా కమిట్‌మెంట్‌లు ఇవ్వడం కష్టం.

Pawan Kalyan future film plans

ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ప్రాజెక్ట్ చాలా ఆలస్యమై, మే 9న రిలీజ్ అయ్యే అవకాశాలపై ఇంకా స్పష్టత లేదు. ‘ఓజీ’ (OG), ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ సినిమాలు పూర్తయ్యే వరకూ ఆయన కొత్త సినిమా తీసుకోవడం అసాధ్యం.

గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాలకృష్ణ (Balakrishna) కోసం ఓ మాస్ స్క్రిప్ట్ (Mass Script) రెడీ చేస్తున్నారు. స్క్రిప్ట్ ఫైనల్ అయినట్టు టాక్ వస్తుండగా, అధికారిక ప్రకటన త్వరలో రావచ్చు. అటువంటి సమయంలో పవన్‌తో కలిసి సినిమా చేయడం కేవలం ఊహాగానం (Assumption) మాత్రమే. పైగా సురేందర్ రెడ్డి (Surender Reddy) ప్రాజెక్ట్ కూడా ప్రస్తుతానికి క్యాన్సల్ అయ్యే అవకాశాలున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో పవన్ నుంచి ‘హరిహర వీరమల్లు’ పార్ట్ 1 & 2, ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పూర్తయ్యేంత వరకూ కొత్త సినిమాలపై క్లారిటీ రావడం కష్టమే. ఆయన రాజకీయ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని సినిమాల కమిట్‌మెంట్‌లు తగ్గిస్తున్నట్టు కనిపిస్తోంది. అభిమానులు మాత్రం ఆయన నుండి తక్కువలో ఎక్కువ సినిమాలు రావాలని కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *