Pawan Kalyan: కూటమి నేతలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. కూటమి నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గత కొన్ని రోజులుగా నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని.. తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న తరుణంలో…. తాజాగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు.

Pawan kalyan post over nda leaders over nara lokesh

కూటమి శ్రేణులు అందరూ బాధ్యత యుతంగా… వ్యవహరిస్తూ…. కూడ మీ ఆశయాన్ని కాపాడాలని కోరారు. లేకపోతే పరిణామాలు వేరేలా ఉంటాయని… స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అనవసరమైన వివాదాలు అలాగే విభేదాల జోలికి అస్సలు వెళ్లకూడదని తెలుగుదేశం కూటమి పార్టీ నేతలను కోరారు. తప్పుడు వార్తలపై అలాగే కూటమి అంతర్గత వ్యవహారాలపై ఎవరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకూడదని విజ్ఞప్తి చేశారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

తాను ఏ రోజు కూడా పదవుల కోసం పనిచేయలేదని ఆయన గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ కూటమి లాభం కోసమే పని చేయాలి తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకు… పనిచేయకూడదని విజ్ఞప్తి చేశారు. అయితే నారా లోకేష్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఈ పోస్ట్ పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *