Pawan Kalyan: “OG” ని రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్.. షాక్ లో ఫ్యాన్స్.?
Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పెద్ద షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ ఓజి ని రిజెక్ట్ చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ ఓజి ని ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన ఫ్యాన్స్ చాలా రోజుల నుండి సినిమాల్లో చూడాలి అనుకుంటున్నారు. కానీ ఆయన నటించిన సినిమాలేవి ఇంకా పూర్తిగా షూటింగ్ జరుపుకోలేదు.
Pawan Kalyan rejected OG Fans in shock
ఇక హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఈ ఏడాది మార్చి 28న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా తర్వాత ఓ జి సినిమా కూడా పట్టాలెక్కబోతుంది.. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సాహూ గారపాటి నిర్మాతగా చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్, గ్లీంప్స్ ఇప్పటికే అభిమానుల్లో భారీ హైప్ పెంచేశాయి. (Pawan Kalyan)
Also Read: Kalki 2 Script: ప్రభాస్ ఫ్యాన్స్ లో ఖుషి నింపిన కల్కి దర్శకుడు.. విషయం ఏంటంటే?
అయితే ఈ సినిమాని తాజాగా పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక పవన్ రిజెక్ట్ చేశారంటే సినిమా మొత్తాన్ని కాదు పార్ట్ టూ ని. ఇక విషయం ఏమిటంటే..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా పై ఉన్న భారీ హోప్స్ దృష్ట్యా దర్శక నిర్మాతలు ఈ సినిమా ని రెండు పార్ట్ లుగా తీసుకురావాలి అనుకున్నారట.
అయితే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కి చెప్పగా నో ఈ సినిమాకి పార్ట్ 2 అవసరం లేదు. అందులో నేను చేయను అని చెప్పేసారట.ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒప్పుకున్నా ప్రాజెక్టులన్ని వాయిదా పడిపోయాయి. ఇలాంటి టైంలో అంటే చాలా కష్టం. ఓవైపు రాజకీయాల్లో మరోవైపు సినిమాల్లో కొనసాగాలంటే కష్టమైన పని. అందుకే ఓజీ పార్ట్-2 ని రిజెక్ట్ చేశారట పవన్ కళ్యాణ్.(Pawan Kalyan)