Pawan Kalyan: అల్లుడు అంటూనే బన్నీపై పగ బయటపెట్టిన పవన్ కళ్యాణ్.?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన పేరులో ఏ విధంగా పొగరు ఉందో ఆయన మాట తీరు, చేసే పనుల్లో కూడా పవర్ ఉంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరూ హీరోలు ఒక లెక్క అయితే పవన్ కళ్యాణ్ మరో లెక్క.. నాకు కొంచెం తిక్క ఉంది దానికి కొంచెం లెక్క ఉంటుంది అనే విధానానికి నిదర్శనం పవన్ కళ్యాణ్. సినిమా ఇండస్ట్రీలో ఎంత ఎదిగాడో, రాజకీయాల్లో కూడా అంతే ఎదిగి చూపించారు. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి గెస్ట్ గా వచ్చారు.

Pawan Kalyan who expressed his grudge against Bunny

Pawan Kalyan who expressed his grudge against Bunny

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. ముఖ్యంగా అల్లు ఫ్యామిలీపై ఉన్నటువంటి కోపాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పవచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ చరణ్ లో అహంకారం ఉండదని, అందరినీ గౌరవిస్తారని అన్నారు. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్న రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిన దానికి మూలం మెగాస్టార్ అంటూ చెప్పుకొచ్చారు. తన కష్టం వల్లే ఈరోజు ఈ పొజిషన్ కి వచ్చామని అన్నారు. (Pawan Kalyan)

Also Read: Game Changer: గేమ్ ఛేంజర్ కి పోటీగా మరో భారీ యాక్షన్ సినిమా.. దిల్ రాజు కి పెద్ద దెబ్బే!!

చరణ్ ఆస్కార్ వేదిక వరకు వెళ్లినా కానీ ఆయనలో ఏ మాత్రం గర్వం ఉండదని, ఎంత ఎదిగిన ఒదిగి ఉండే లక్షణం అంటూ చెప్పుకొచ్చారు. ఎవరైనా సరే మనం ఏ స్థాయి నుంచి వచ్చామో దాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని, మూలాలు మర్చిపోకూడదని బలంగా చెప్పారు. ఇక ఇదే కాకుండా సినిమా ఫీల్డ్ ను ఏపీలో బాగా డెవలప్ చేస్తామని, జనాలకు మెసేజ్ ఇచ్చే సినిమాలు తీయాలని అన్నారు. అలాగే టికెట్ రేట్లు ఎందుకు పెంచుతారో కూడా తెలియజేశారు.

Pawan Kalyan who expressed his grudge against Bunny

డిమాండ్ మరియు సప్లై మీద టికెట్ రేట్లు ఆధారపడి ఉంటాయని భారీ బడ్జెట్ పెట్టిన సినిమాలకు టికెట్ రేటు పెంచితేనే అందరూ బ్రతుకుతారని, దీనివల్ల 18 శాతం ప్రభుత్వానికి పన్ను రూపంలో కూడా వెళుతుందని తెలియజేశారు. ముఖ్యంగా మూలాలు మర్చిపోకూడదని మూలాలు మర్చిపోయిన వ్యక్తులు వేస్టు అనే విధంగా మాట్లాడారు. ఈ మాటను పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పడంతో, కొంతమంది నెటిజన్స్ ఇది పుష్ప2 సినిమా విషయంలో అల్లు అర్జున్ చేసిన అతిపై పరోక్షంగా పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారని అన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అన్న మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.(Pawan Kalyan)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *