Anna Lezhinova : తిరుమల శ్రీవారికి పవన్ కళ్యాణ్ సతీమణి భారీ విరాళం
Anna Lezhinova : తిరుమల శ్రీవారి సన్నిధిలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లేజినోవ… భారీ విరాళం ఇచ్చారు. తిరుమల శ్రీ శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి ఏకంగా 17 లక్షల రూపాయల భారీ విరాళం అందించారు. ఇక ఈ విరాళాన్ని… ఇవాళ మధ్యాహ్నం అన్నదానం రూపంలో తిరుమల శ్రీవారి భక్తులకు అందించబోతున్నారు.

Pawan Kalyan’s wife Anna Lezhinova makes a huge donation to Tirumala Srivaru
నిన్న… తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్ళిన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లేజినోవ. ముందుగా తలనీలాలు సమర్పించారు. నిన్న రాత్రి అక్కడే.. ప్రముఖ సత్రంలో సేద తీరారు అన్నా లేజినోవ. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అన్నా లేజినోవ. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత భారీ విరాళం అందించడం జరిగింది. అనంతరం తిరుమలలో ఉన్న ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నారు.
KCR: కెసిఆర్ సభ… దిగివచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ?
ఇది ఇలా ఉండగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్కు శంకర్ ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. సింగపూర్ లోని ఓ ప్రముఖ స్కూల్లో అగ్ని ప్రమాదం జరగదుగా అందులో మార్క్ శంకర్ కాళ్లు అలాగే చేతులు పూర్తిగా కాలిపోయాయి. దీంతో అక్కడ ప్రముఖ ఆసుపత్రిలో వైద్యం అందించి ఇండియాకు తీసుకువచ్చారు. ప్రస్తుతం డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే శంకర్ ఆరోగ్యంతో ఉండడంతో మొక్కలు తీర్చుకునేందుకు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లేజినోవ తిరుమలకు వెళ్లడం జరిగింది.
Vijayasaireddy: మరోసారి రాజ్యసభకు విజయసాయిరెడ్డి.. ప్లానంత జగన్ దేనా ?