Payal Rajput upcoming movie: పాయల్ రాజ్ పుత్ అందాల హొయలు.. కాక పుట్టిస్తున్న మెరుపులు!!
Payal Rajput upcoming movie: పాయల్ రాజ్ పుత్, తన కెరీర్‌లో అనేక సినిమాల్లో నటించినప్పటికీ, ఆమెకు స్టార్ గుర్తింపు సాధించడం కష్టమైంది. ఎక్కువగా గ్లామర్ పాత్రలతోనే మెప్పించిన ఈ బ్యూటీ, పలు సినిమాలలో తన స్కిల్స్‌ను ప్రదర్శించింది. అయితే, “మంగళవారం” సినిమాతో ఆమె మళ్లీ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమాతో ఆమె ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించింది.
Payal Rajput upcoming movie Venkatlachimi.
పాయల్ రాజ్ పుత్, ఈ చిత్రాన్ని తర్వాత తన కెరీర్‌ను స్లోగా కొనసాగిస్తుంది, మంచి కథలు ఎంచుకుంటూ సక్సెస్ వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఆమె కొన్ని అద్భుతమైన ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటూ తన నటనను మరింత మెరుగుపర్చుకుంటుంది. ఈ భామ త్వరలో వెంకటలచ్చిమీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మని దర్శకత్వంలో రూపొందింది, ఇందులో రాజా మరియు ఎన్ చౌదరి నిర్మాణం చేస్తున్నారు. పాయల్ తన అభిమానులకు మరింత దగ్గరగానే ఉంటుందని అనుకుంటుంది.
ఇక, పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ వరస ఫోటో షూట్‌లతో తన అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా, చీరలో తన అందాలను ప్రదర్శిస్తూ “చిరునవ్వు ఇంతకంటే మించి ఇంకేం కావాలి?” అంటూ ఫొటోలు షేర్ చేసింది. ఈ మల్టీకలర్ చీరలో ఆమె అందం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.