Pink Ball Test: పింక్ టెస్ట్ లో టీమిండియా ఓటమికి 5 కారణాలు ?
Pink Ball Test: పింక్ బాల్ టెస్ట్ లో భారత్ ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…. రెండో టెస్ట్ లో టీమ్ ఇండియా ఓటమికి ప్రధానంగా బ్యాటింగ్ ఫెయిల్యూర్ కారణమని చెప్పవచ్చు. మొదటి ఇన్నింగ్స్ లో టాప్ బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో గంపెడు ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ 7 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. Pink Ball Test

Pink Ball Test team india five reasons
కెప్టెన్ రోహిత్ శర్మ మూడు రన్స్ చేసి క్రీజును వీడడం జరిగింది. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శుబ్ మన్ గిల్ ఆటలో విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్ లోను ఇదే తీరు కనబరిచారు. రాహుల్, రోహిత్ శర్మ డబుల్ డిజిట్ కూడా టచ్ చేయలేదు. ఇదే మ్యాచ్ రిజల్ట్ ను డిసైడ్ చేసింది. అడిలైడ్ లో పింక్ బాల్ అనూహ్యంగా బౌన్స్ అవడంతో ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. Pink Ball Test
Also Read: Telangana: కాంగ్రెస్ ఏడాది పాలనపై సంచలన సర్వే.. రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగలనుందా ?
రిషబ్ పంత్ తో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఈ బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలింగ్ డామినేషన్ ఎక్కువగా కనబరిచింది. హోమ్ కండిషన్స్ అలవాటు పడిన వాతావరణం పింక్ బాల్ తో ఆడిన అనుభవాన్ని ఆ జట్టు పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. భారత ఓపెనర్లు సరైన ఆరంభం ఇవ్వకపోవడం, టాపార్డర్ పార్ట్నర్ షిప్స్ బిల్డ్ చేయకపోవడంతో మిడిల్ ఆర్డర్ మీద తీవ్రంగా ఒత్తిడి పెరిగింది. అందుకే భారత్ పింక్ బాల్ టెస్ట్ లో ఓటమి పాలైంది. Pink Ball Test