Game Changer: గేమ్ ఛేంజర్ సినిమా ప్లస్,మైనస్ లు.. భారమంతా దానిమీదే..?
Game Changer: తెలుగు ఇండస్ట్రీలో అత్యంత పాపులర్ హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన రామ్ చరణ్ దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన హిట్ సాధించింది. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్స్ కార్యక్రమంలో బిజీగా ఉంది. జనవరి 10వ తేదీన సంక్రాంతి బరిలో నిలవబోతున్న ఈ చిత్రంపై అందరికీ ఆసక్తి నెలకొని ఉంది.
Pluses and minuses of the movie Game Changer
అలాంటి ఈ సినిమాపై ఇప్పటికే కొన్ని ప్లస్ లు, మైనస్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ఎలా ఉండబోతోంది. సినిమాకు ఏది ప్లస్ కాబోతోంది? ఏది మైనస్ కాబోతుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో రాబోతున్న ఈ మూవీలో అంజలి, కియారా అద్వానీ హీరోయిన్స్ గా చేస్తున్నారు. జనవరి 10వ తేదీన అంగరంగ వైభవంగా రిలీజ్ అవుతున్నాయి చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, అందరిని విశేషంగా ఆకట్టుకుంది.. (Game Changer)
Also Read: Naga Chaitanya: పెళ్లయ్యాక ఆ హీరోయిన్ కోసం సీక్రెట్ గా ఫ్లాట్ కొన్న నాగచైతన్య.. షాక్ లో శోభిత.?
కానీ అలాంటి ఈ చిత్రంపై కాస్త భయం కూడా నెలకొని ఉంది. సాధారణంగా రాజమౌళి సినిమా తర్వాత హీరోలు ఏ సినిమా చేసినా ప్లాప్ అవుతుంది. కానీ ఈ విషయంలో అపోహ తొలగిపోయింది. రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవర చిత్రం చేశారు ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇదే తరుణంలో చరణ్ కూడా జక్కన్న సినిమా తర్వాత గేమ్ చేంజర్ చేస్తున్నారు. రాజమౌళి సినిమా సెంటిమెంటు చరణ్ మీద పడింది అంటే సినిమా పోయినట్టే.. ఇదే కాకుండా శంకర్ డైరెక్షన్ లో వచ్చినటువంటి ఇండియన్ 2 సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది.
ఈ క్రమంలో ఆ సినిమాలాగే గేమ్ చేంజర్ కూడా ఉంటుందా. సినిమా ప్లస్ విషయానికి వస్తే ఈ సినిమాలో మొదటి భాగం కంటే రెండో భాగం చాలా బాగా ఆకట్టుకుంటుందట. అద్భుతమైన నటనతో రామ్ చరణ్ రెచ్చిపోతారట..ఎస్ జే సూర్యతో చాలెంజ్ గెలవడానికి రామ్ చరణ్ చేసిన ప్రయత్నాలు అందరిని ఆకట్టుకుంటాయట. దీనికి తోడు కియారా అద్వానీ నటన అందాలు మరో లేవల్ అంటున్నారు. మరి చూడాలి ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి హిట్ అవుతుందా? ఫట్ అవుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.(Game Changer)