KCR: కెసిఆర్ సభ… దిగివచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ?
KCR: కల్వకుంట్ల చంద్రశేఖర రావు దెబ్బకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చింది. వరంగల్ లోని ఎల్కతుర్తి లో గులాబీ పార్టీ సభ నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సభ నేపథ్యంలో తాజాగా వరంగల్ పోలీసులు అనుమతులు జారీ చేశారు. వాస్తవానికి మొదట… కెసిఆర్ సభకు అనేక అడ్డంకులు తెలిపారు వరంగల్ పోలీసులు.

Police Green Signal For KCR Meeting
దాదాపు 30 రోజులపాటు వరంగల్ జిల్లాలో సభలు అలాగే ఊరేగింపులు నిర్వహించకూడదని ఉత్తర్వులు జారీ చేశారు పోలీసులు. దీంతో ఈనెల 27వ తేదీన జరగాల్సిన గులాబీ పార్టీ సభ రద్దవుతుందని అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే… తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు గులాబీ పార్టీ నేతలు.
Indra Movie: ఇంద్ర సినిమా ఇండస్ట్రీ హిట్ వెనుక ఇంత పెద్ద కథ నడిచిందా.?
ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కూడా పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ లో నిర్వహించబోయే గులాబీ పార్టీ సభకు అనుమతులు ఇచ్చారు. దీంతో వెంటనే తెలంగాణ హైకోర్టులో వేసిన కేసులు విత్ డ్రా చేసుకుంది గులాబీ పార్టీ. పోలీసుల నిర్ణయంతో యధా విధంగా.. ఏప్రిల్ 27వ తేదీన కేసీఆర్ సభ నిర్వహించబోతున్నారు.
Esha Gupta: నటిగా ఎదగాలంటే ఇండస్ట్రీ లో అది చేయడం అవసరం.. ఓపెన్‌గా చెప్పేసిన ఈషా!!