Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల శ్రీవారి లడ్డు గురించి వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపారని చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడం జరిగింది. ఈ తతంగం మొత్తం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిందని చంద్రబాబు నాయుడు ఆరోపించడం మనం చూశాం. దీంతో తిరుమల శ్రీవారి లడ్డు చుట్టూ దేశ రాజకీయాలు కొనసాగుతున్నాయి. Jagan
Police Rules over Jagan Tirumala Tour
ముఖ్యంగా ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం గురించి తప్పితే… మరో వివాదం గురించి… ఎవరు మాట్లాడడం లేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు స్వయంగా రంగంలోకి దిగారు జగన్మోహన్ రెడ్డి. తిరుమల.. శ్రీవారిని శనివారం రోజున దర్శించుకోనున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం తిరుమలకు చేరుకోనున్నారు. ఈ తరుణంలోనే.. జగన్మోహన్ రెడ్డి ని అడ్డుకునేందుకు… కూటమి సర్కార్ భారీ స్కెచ్ వేసింది. Jagan
Also Read: Ys Jagan: చంద్రబాబుకు షాక్.. కాలినడకన తిరుమలకు జగన్?
తిరుమలలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ను అమలు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది పోలీస్ శాఖ. శాంతి భద్రతల విషయంలో భాగంగా… తిరుమలలో ఈ సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన ఉన్న నేపథ్యంలో వైసిపి నేతలు ర్యాలీలు తీసే అవకాశాలు ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనను.. అట్టర్ ఫ్లాప్ చేసేందుకు కూటమి సర్కార్ ఇలా ప్లాన్ చేసినట్లు వైసిపి నేతలు చెబుతున్నారు. Jagan