Mohan Babu: హత్యాయత్నం కేసులో హీరో.. పరారీలో ఉన్న మోహన్ బాబు!!

Mohan Babu: సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఇటీవల మీడియా ప్రతినిధిపై దాడి కేసులో చిక్కుకున్నారు. పహాడీ షరీఫ్ పోలీసు స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ కోసం పోలీసులు ఆయనను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మోహన్ బాబు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారని సమాచారం. ఈ అంశం చర్చనీయాంశమవుతుండగా, ఆయన దుబాయికి వెళ్లిపోయినట్లు గాసిప్స్ వెలువడాయి. అయితే, ఆయన తరఫు న్యాయవాదులు ఈ ప్రచారాలను ఖండిస్తూ, “మోహన్ బాబు భారత్‌లోనే ఉన్నారు,” అని స్పష్టీకరించారు.

Police search for Mohan Babu whereabouts

Police search for Mohan Babu whereabouts

జల్‌పల్లి ప్రాంతంలోని తన నివాసంలో జరిగిన ఒక కుటుంబ కలహాల వ్యవహారంలో మీడియా కవరేజ్ కోసం వచ్చిన ఓ జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనలో జర్నలిస్టు నుంచి మైక్ లాక్కుని, అతనిపై చేయి చేసుకోవడం వల్ల అతను గాయపడ్డాడు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో, మోహన్ బాబు మీడియాకు లిఖితపూర్వకంగా క్షమాపణలు తెలిపారు. ఆయన తన చర్యలను సమర్థించుకోకుండా, బాధిత జర్నలిస్టుకు సానుభూతి వ్యక్తం చేశారు.

Also Read: Famous Telugu actresses: రకుల్ నుంచి శోభిత వరకూ.. ఈ ఏడాది తెలుగు తారల పెళ్లిళ్లు!!

దాడి అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టును మోహన్ బాబు మరియు ఆయన కుమారుడు మంచు విష్ణు కలిసి పరామర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి వెళ్లి, బాధితుడు మరియు అతని కుటుంబానికి క్షమాపణలు చెప్పడం జరగింది. అయితే, జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు కూడా నమోదవ్వడం మరింత కలకలం రేపుతోంది.

ఈ కేసు నేపథ్యంలో ఆయనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వివాదం తెలుగు సినీ పరిశ్రమలో మాత్రమే కాకుండా, సామాజి వర్గాల్లో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం మోహన్ బాబు వంటి ప్రముఖ నటుడి ఇమేజ్‌కు చెడ్డ ప్రభావం చూపుతోంది. కానీ, ఆయన క్షమాపణలు చెప్పడం, బాధిత జర్నలిస్ట్ ను పరామర్శించడం వంటి చర్యలు వివాదాన్ని సద్దుమణిగించే దిశగా కదిలాయి. ఈ కేసు ఎలా పరిష్కారమవుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *