Pomegranate leaves: ఆయుర్వేదంలో దానిమ్మ ఆకులకు చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. దానిమ్మ ఆకులను చర్మ రోగాల నివారణకు, కుష్టు వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. దానిమ్మ ఆకులను చాలా రకాల మందులలో కూడా వాడుతారు. వీటివల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. దానిమ్మ ఆకులతో తయారు చేసిన మందులను వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటుంది. వీటిని మందులలోనే కాకుండా దానిమ్మ ఆకులను కషాయంగా తయారు చేసుకుని రోజు ఒకసారి తాగినట్లయితే జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులనుంచి ఉపశమనం లభిస్తుంది. Pomegranate leaves
Pomegranate leaves Benfits
చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడతారు. అలాంటి వారు దానిమ్మ ఆకులను పేస్ట్ చేసుకుని దానిని రోజు రాత్రి పడుకునే ముందు ఒక చెంచాడు తిన్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. చాలామంది చర్మ సమస్యలతో బాధపడతారు. అలాంటివారు దానిమ్మ ఆకులను పేస్ట్ చేసుకుని అందులో తేనె కలుపుకొని ముఖానికి అప్లై చేసుకున్నట్లయితే మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తొలగిపోతాయి. Pomegranate leaves
Also Read: Yograj Singh: కపిల్ దేవ్ పై యూవీ ఫ్యామిలీ షాకింగ్ కామెంట్స్…ప్రజలు మీపై ఉమ్మేస్తారు..?
తామర, గజ్జి, అలర్జీ వంటి స్కిన్ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కూడా దానిమ్మ ఆకులను పేస్ట్ చేసుకొని దానిని అప్లై చేస్తే అతితక్కువ సమయంలోనే చర్మ సంబంధ వ్యాధులు నయం అవుతాయి. అంతేకాకుండా శరీరంపై గాయాలు అయిన చోట దానిమ్మ ఆకులతో చేసిన పేస్ట్ తయారు చేసుకుని పెట్టినట్లయితే రెండు మూడు రోజులలో గాయాలు నయం అవుతాయి. Pomegranate leaves
మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు దానిమ్మ ఆకులను కొద్దిగా వేడి చేసి ఆకులను ఒక బట్టలో వేసి నొప్పి ఉన్నచోట ఒక గంట పాటు కట్టు కట్టుకున్నట్లయితే నొప్పులు త్వరగా నయం అవుతాయి. పూర్వకాలంలో చాలామంది దానిమ్మ ఆకులను అనేక రకాలుగా వాడేవారు. మారుతున్న కాలాన్ని బట్టి కొంతమందికి దానిమ్మ ఆకుల ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అయితే ఇప్పటికీ దానిమ్మ ఆకులతో కలిగే లాభాలను తెలుసుకొని అవసరమైన వారు ఉపయోగించుకోవాలని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. Pomegranate leaves