Pooja Hegde: ఆ హీరోతో పూజ హెగ్డే ఎఫైర్.. స్విమ్మింగ్ చేస్తూ రొమాన్స్.?

Pooja Hegde: పూజ హెగ్డే గత కొద్ది రోజుల నుండి వార్తల్లో నిలుస్తున్న బ్యూటీ.ఎందుకంటే ఈ హీరోయిన్ బాలీవుడ్ ని గుడ్డిగా నమ్ముకొని టాలీవుడ్ ని పూర్తిగా దూరం పెట్టేసి టాలీవుడ్ లో అవకాశాలు లేకుండా చేసుకుంది.అయితే ప్రస్తుతం హిందీలో రెండు మూడు సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్ కి తెలుగులో అవకాశాలు లేకపోయినప్పటికీ తమిళంలో మాత్రం బాగానే అవకాశాలు ఉన్నాయి. సూర్యతో రెట్రో మూవీ తో పాటు కోలీవుడ్ హీరో విజయ్ తో జననాయగన్ సినిమాలో చేస్తుంది.
Pooja Hegde affair with that hero
అలాగే రాఘవ లారెన్స్ కాంచన -4 లో కూడా పూజ హెగ్డే నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక రజినీకాంత్ కూలీ మూవీలో పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు టాక్. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ హీరోతో కలిసి సిమ్మింగ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజెన్స్ ఈ ఫోటోల కింద నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.ఇక అసలు విషయం ఏమిటంటే..తాజాగా పూజ హెగ్డే బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో కలిసి రిషికేష్ లో సందడి చేశారు.(Pooja Hegde)
Also Read: Roja: రోజా పొగరు.. చెప్పినా వినకుండా ఆ హీరోయిన్ ని బండ బూతులు తిట్టి.?
అయితే ప్రస్తుతం వరుణ్ ధావన్ పూజ హెగ్డే కాంబోలో హై జవానీ తో ఇష్క్ హోనా హై అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ని ఉత్తరాఖండ్లోని రిషికేష్ లో కొంత భాగం షూట్ చేశారు. అందులో భాగంగా షూటింగ్ ముగించుకొని అక్కడే ఉన్న నదిలో వరుణ్ ధావన్ పూజ హెగ్డే ఇద్దరు స్విమ్మింగ్ చేశారు. అయితే పూజ హెగ్డే స్విమ్ సూట్ లో కనిపించగా వరుణ్ ధావన్ పూజ చేయి పట్టుకొని నదిలోకి పరిగెత్తించారు.

ప్రస్తుతం ఈ వీడియోని షేర్ చేసి రిషికేష్ లో తర్వాత షెడ్యూల్ కోసం కలుసుకుందాం అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం వీళ్ళు పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు పూజ హెగ్డే వరుణ్ ధావన్ తో డేటింగ్ చేస్తుందా ఏంటి..లేకపోతే స్విమ్మింగ్ సూట్లో మరో హీరోతో సందడి చేయడం ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ వీళ్ళు ఒకే సినిమాలో చేస్తున్నారు కాబట్టి అలా సరదాగా అక్కడి లొకేషన్ ని ఎంజాయ్ చేశారు అని మరి కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సినిమా షూటింగ్ చేసే సమయంలో హీరో హీరోయిన్ మధ్య ఏ చిన్న ఫోటో బయటపడ్డ కూడా వారి మధ్య ఏదో ఉంది అని కథలు అల్లేస్తూ ఉంటారు.(Pooja Hegde)
https://www.instagram.com/reel/DHlJPdPs4cI/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==