Pooja Hegde: తండ్రి కొడుకులతో రొమాన్స్ చేసిన హీరోయిన్.. మాములు మ్యాటర్ కాదు బాబోయ్!!
Pooja Hegde: తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని కుటుంబం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఈ కుటుంబం సినీ రంగంలో అనేక సంవత్సరాలుగా కొనసాగుతూ, పలు తరాల నటులతో ఇండస్ట్రీకి పెద్ద పేరును ఇచ్చింది. ప్రస్తుతం నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ వంటి అక్కినేని కుటుంబానికి చెందిన హీరోలు తమ ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నారు. అయితే, ఇటీవల కాలంలో వారి సినిమాలకు అంతగా ఆదరణ లభించడం లేదు, ఇది పరిశ్రమలో కొంత ఆందోళన కలిగిస్తుంది.
Pooja Hegde Role in Akkineni Movies
నాగార్జున తన సినిమాటిక్ కెరీర్‌లో అనేక విజయాలను అందుకున్నారు. దశాబ్దాల పాటు కొనసాగిన ఈ నటుడు, ప్రస్తుతం ‘కుబేర’, ‘కూలీ’ వంటి భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్నాడు. హీరో గా ఫ్లాప్ లు వచ్చినా నాగార్జున తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయన చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ, ఆయన కెరీర్ ఇంకా బిజీ గానే కొనసాగుతుంది.
నాగ చైతన్య ప్రస్తుతం ‘తండేల్’ సినిమాతో తన కెరీర్‌ను మరో మలుపు తిప్పాలని చూస్తున్నాడు. ఈ సినిమాతో అంచనాలను దాటాలని ఆశిస్తున్నాడు, కానీ గతంలో విడుదలైన కొన్ని సినిమాలు ప్రేక్షకుల నుండి ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. అయినా నాగ చైతన్య తన నటనలో మరింత మెరుగుదలను చూపిస్తూ, పరిశ్రమలో నిలబడేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు.
అఖిల్ చేసిన ‘ఏజెంట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. అయితే ఇప్పుడు ఓ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అందుకే టైం తీసుకుని మరీ వేచి చూస్తున్నాడు. అయితే అక్కినేని కుటుంబం హీరోలందరితో కలిసి నటించిన ఏకైక హీరోయిన్ పూజా హెగ్డే అని సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఆమె నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం’ సినిమాతో, అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో నటించింది. దీంతో పాటు, నాగార్జునతో కలిసి కొన్ని యాడ్స్‌లో కూడా కనిపించింది. ఈ చిత్రాల ద్వారా పూజా హెగ్డే మరింత గుర్తింపు పొందింది. ఆమె అక్కినేని హీరోలతో చేసిన ఈ సినిమాలు విశేషంగా ఆదరణ పొందాయి. అక్కినేని కుటుంబం తెలుగు సినీ పరిశ్రమకు గొప్ప కాంట్రిబ్యూషన్ ఇచ్చింది. కొంతకాలంగా వారి సినిమాలు అంచనాలను అందుకోవడంలో విఫలమవుతున్నప్పటికీ, వారి కెరీర్‌లో ఎన్నో విజయాలు ఉన్నాయి.