Poonam kour: నా లైఫ్ నాశనం చేసి హ్యాపీగా.. త్రివిక్రమ్ బండారం బయటపెట్టిన పూనమ్.?
Poonam Kour: ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు మహిళా నటీమణులు వారు ఇండస్ట్రీలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను వారిని ఇబ్బంది పెట్టిన వారి గురించి డైరెక్టుగా మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు. అలాంటి ఈ తరుణంలో హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా తనకు జరిగిన అన్యాయం గురించి తనకు అన్యాయం చేసిన వారి గురించి డైరెక్ట్ గా పేర్లను చెప్పి సంచలనం సృష్టిస్తోంది. మరి ఆమెకు అన్యాయం చేసిన వారు ఎవరు ఆ వివరాలు ఏంటో చూద్దాం.. పూనమ్ కౌర్ తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో హీరోయిన్గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Poonam Kour exposed by Trivikram true nature
తనదైన నటనతో అంద చందాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం కాస్త సినిమాలకు దూరమైనటువంటి ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను, తాను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా అభిమానులతో తెలియజేస్తోంది. ఆ మధ్య కాలంలో హీరో పవన్ కళ్యాణ్ మరియు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లపై దారుణంగా కామెంట్లు చేసింది. మరి వారు ఈమెకు ఏం అన్యాయం చేశారో తెలియదు కానీ తనకు టైం దొరికినప్పుడల్లా ఏదో ఒక కామెంట్ తో వారిని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటుంది. గతంలోనే ఈమె డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై అనేక పోస్టులు పెట్టి తన బాధను చెప్పింది.. ( Poonam Kour)
Also Read: Daku Maharaj: డాకూ మహారాజ్ ట్రైలర్ లో ఈ మిస్టేక్ గమనించారా.. నిరాశలో ఫ్యాన్స్.?
గతంలో ఆమె నాకు త్రివిక్రమ్ చేసే చెడు పనుల గురించి తెలుసు.. అతనికి సపోర్ట్ చేసే వ్యక్తుల గురించి కూడా తెలుసు.నేను నా అనుభవంతో మాట్లాడుతున్నానంటూ చెప్పుకొచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ అమ్మాయిల జీవితాలను నాశనం చేసే వ్యక్తి అంటూ మండిపడింది. అంతేకాదు ఆయనపై చర్యలు తీసుకోవాలని మా అసోసియేషన్ వారికి ఫిర్యాదు కూడా చేసాను . కానీ నా ఫిర్యాదును అంతగా ఎవరూ పట్టించుకోలేదు అని చెప్పింది.అలాంటి పూనమ్ కౌర్ తాజాగా మరో ట్వీట్ చేసి సంచలనం సృష్టిస్తోంది. నేను గతంలో మా అసోసియేషన్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ఆయనపై యాక్షన్ తీసుకోలేదని నా జీవితాన్ని అన్ని రకాలుగా నాశనం చేసిన అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది.
నా ఆనందం సంతోషాన్ని ఆయన దూరం చేశారు.. నువ్వు ఎలాంటి వాడివి అన్నది కాదు నువ్వు ఏం పనులు చేస్తున్నావన్నదే ముఖ్యం అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. కానీ దీనిపై ఎప్పుడూ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పందించడం లేదు. మరి ఈసారైనా స్పందిస్తారా నాకెందుకులే అని సైలెంట్ అవుతారా అనేది ముందు ముందు తెలుస్తుంది. ఇక మా అసోసియేషన్ గురించి పూనం మాట్లాడిన మాటలకు మా కోశాధికారి శోబాయాలజీ మాట్లాడుతూ పూనంక మా అసోసియేషన్ కి ఫిర్యాదు చేశానని చెప్పింది కానీ ఆమె ఫిర్యాదు రాతపూర్వకంగా ఎక్కడ లేదు. గతంలో మేము లేనప్పుడు చేసినా కూడా రికార్డులో ఎలాంటి ఫిర్యాదు నమోదు చేసి లేదు. పోలీస్ స్టేషన్ కి గానీ మా అసోసియేషన్ ని గాని ఆమె సంప్రదిస్తే మంచిది అంటూ కౌంటర్ ఇచ్చారు.( Poonam Kour)