Pawan Kalyan: “రెస్ట్ ఇన్ పీస్” అంటూ పవన్ కళ్యాణ్ కొడుకుపై పోస్ట్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ రీసెంట్గా అగ్ని ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ మూడో భార్య కొడుకు మార్క్ శంకర్ సింగపూర్లో చదువుకుంటున్నాడు. అయితే సింగపూర్లో ఆయన చదువుకునే స్కూల్ కి మంటలు అంటుకోవడంతో చాలామంది పిల్లలు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు.
Post about Pawan Kalyan son saying Rest in Peace
ఇక అగ్ని ప్రమాదం నుండి పిల్లల్ని కాపాడినప్పటికీ అప్పటికే మంటల్లో ఇరుక్కున్న చిన్నారులకు ఊపిరితిత్తుల్లోకి ఆ పొగ వెళ్లడం వల్ల కాస్త అనారోగ్యానికి గురయ్యారు.అలా పవన్ కళ్యాణ్ కొడుకుకి కూడా కాళ్లు చేతులకి చిన్నపాటి గాయాలయ్యాయి.ఊపిరితిత్తుల్లోకి ఆ పొగ వెళ్లడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో ఒకరోజు ఐసీయూ లో ఉంచి ఆ తర్వాత నార్మల్ వార్డ్ కి షిఫ్ట్ చేశారు. (Pawan Kalyan)
Also Read: Allu Arjun Birthday: బన్నీ బర్త్‌డే.. మెగా ఫ్యామిలీ నిశ్శబ్దం.. మరింత ముదిరిన వివాదాలు!!
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కొడుకు అగ్ని ప్రమాదం జరిగి చిన్న చిన్న దెబ్బలు తాకితే కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో వారి జుగుప్సాకరమైన కామెంట్లతో పోస్టులతో పవన్ అభిమానులకు మంట పుట్టిస్తున్నారు. ఇక విషయంలోకి వెళ్తే.. అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో కొంతమంది ఫేక్ అభిమానులు కావాలనే అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చు పుట్టిస్తున్నారు.

అలా ఓ నెటిజన్ పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ ఫోటోకి రెస్ట్ ఇన్ పీస్ అంటూ కామెంట్ పెట్టి అందరికీ కోపం తెప్పించారు. అంత చిన్న పిల్లవాడి పై ఆ నెటిజన్ పెట్టిన పోస్ట్ కి చాలా మంది ఫైర్ అవుతున్నారు. నీకు పుట్టగతులు ఉండవు రా అంటూ తిట్టిపోస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ఆర్మీ అంటూ పేరు చెప్పుకొని కొంతమంది అల్లు అభిమానుల ముసుగులో ఇలాంటి గొడవలు మెగా,అలు ఫ్యామిలీ మధ్య ఇప్పటికే ఎన్నో పెట్టారు.(Pawan Kalyan)