Post Office: ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డబ్బులను ఆదా చేసుకుంటూ ఉంటారు. పోస్ట్ ఆఫీస్ అనేక రకాల స్కీములని అందిస్తోంది. చాలామంది పోస్ట్ ఆఫీస్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. పోస్ట్ ఆఫీస్ లో మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయి. వీటిలో డబ్బులు పెడితే మంచిగా రాబడి వస్తుంది. పోస్ట్ ఆఫీస్ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా రకరకాల పథకాలను తీసుకువచ్చింది. కరోనా వైరస్ తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పై ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది. భీమా తీసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనుకోని సంఘటనల కారణంగా దూరమైనట్లు ఇన్సూరెన్స్ పాలసీలు కుటుంబానికి ఆర్థిక భరోసాన్ని కల్పిస్తాయి.
Post Office super insurance scheme
ఇప్పటికే చాలామంది ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వెనుకడుగేస్తున్నారు. అందుకు గల కారణాలు అధిక మొత్తంలో ప్రీమియం చెల్లించడం. అయితే తక్కువ ప్రీమియంతోనే పోస్టల్ విభాగం జీవిత భీమా పాలసీని తీసుకువచ్చింది. పోస్ట్ ఆఫీస్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమును తీసుకొచ్చింది. భీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి 15 లక్షలు వస్తాయి. నామినీకి డబ్బులు వస్తాయి. శాశ్వతంగా ఏర్పడితే 15 లక్షల వస్తాయి పాలసీదారుడు చనిపోతే పిల్లల చదువుల కోసం లక్ష రూపాయలు, పెళ్లి కోసం లక్ష రూపాయలు అదనంగా చెల్లిస్తారు.
Also read: Spam Calls: ఒక్క క్లిక్ తో స్పామ్ కాల్స్‌ను బ్లాక్ చేయండి..!
పాలసీదారు బ్రతికి ఉంటే వైద్య ఖర్చులకి లక్ష రూపాయలు ఇస్తారు. ఆసుపత్రిలో సాధారణ వైద్యంలో చేరితే 2000 ఇస్తారు. చెయ్యి లేదా కాలు విరిగిపోతే 25000 ఇస్తారు అవుట్ పేషెంట్ కోటలో 30,000 వరకు పొందవచ్చు. వైద్యం చేయించుకుంటున్న టైంలో వెయ్యి రూపాయలు చొప్పున పదిరోజులకు చెల్లిస్తారు. పాలసీదారు చనిపోతే ఇద్దరు పిల్లలు చదువులకు లక్ష వరకు చెల్లిస్తారు. కేవలం 299 ప్రీమియంతో పది లక్షల వరకు ప్రమాద బీమా కల్పిస్తోంది పోస్టుల శాఖ. ప్రమాదంలో చనిపోయినా అంగవైకల్యం చెందిన పక్షవాతం వచ్చిన పది లక్షలు వస్తాయి (Post Office).