Prabhakar: ఇండస్ట్రీ నటితో ఎఫైర్ నిజమే.. ఫైనల్ గా తప్పు ఒప్పుకున్న బుల్లితెర మెగాస్టార్..?
Prabhakar: బుల్లితెర మెగాస్టార్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ప్రభాకర్ మాత్రమే. ఈయనకి ఈటీవీ ప్రభాకర్ బుల్లితెర మెగాస్టార్ అనే గుర్తింపు ఉంది. ఈయన ఇప్పటికే ఎన్నో సీరియల్స్ లో చేసి బుల్లితెర మెగాస్టార్ గా పేరు సంపాదించారు.అయితే అలాంటి ఈయన కేవలం సీరియల్స్ లో మాత్రమే కాకుండా పలు సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రల్లో నటించారు.
Prabhakar relation with that Serial actress
అయితే అలాంటి బుల్లితెర ప్రభాకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ఇండస్ట్రీకి సంబంధించిన ఓ నటితో ఎఫైర్ పెట్టుకొని నా భార్యను మోసం చేశాను అంటూ సంచలన విషయాన్ని బయట పెట్టారు.ప్రభాకర్ మాట్లాడుతూ.. నేను నా భార్యను ఎంతో ప్రేమించాను. కానీ ఓ విషయంలో మాత్రం మోసం చేశాను. నా భార్యకు తెలియకుండా ఇండస్ట్రీలో ఉన్న నటితో ఎఫైర్ పెట్టుకున్నాను.(Prabhakar)
Also Read: Samantha: సమంతకు షాక్ ఇచ్చిన హీరో..లీగల్ నోటీసులు పంపి..?
అయితే ఆ నటితో రిలేషన్ లో ఉన్న సమయంలో కూడా నా కుటుంబం భార్య పిల్లల గురించి ఎక్కువగా చెబుతుంటే వాడిని. కానీ ఆ రిలేషన్ తప్పే. అయితే ఈ ఎఫైర్ విషయం తెలిసిన నా భార్య ఎంతగానో బాధపడింది. లోలోపల తనకు తానే కుదిలిపోయింది.కానీ ఆ తర్వాత నేను ఆ నటికి దూరమయ్యాను. నా భార్యకి నేను సర్ది చెప్పి ఎప్పటికీ చేయి విడిచిపెట్టను అని చెప్పాను.కానీ ఆ సమయంలో నా భార్య నువ్వు ఇంతే అని నన్ను పక్కన పెట్టకుండా నా మనసుని అర్థం చేసుకొని మళ్లీ నన్ను స్వీకరించింది..
ఇక నటితో నేను రిలేషన్ లో ఉన్న సమయంలో నా భార్య చాలా బాధపడి నన్ను మోసం చేశాడు అనుకుంది. కానీ ఆ తర్వాత ఆ నటికి బ్రేకప్ చెప్పి నా భార్యతోనే నా జీవితం అని అనుకున్నాను.ఆ సమయంలో నా భార్య నన్ను పూర్తిగా నమ్మింది.ప్రస్తుతం మేము చాలా హ్యాపీగా ఉన్నాం అంటూ ప్రభాకర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే గతంలో ప్రభాకర్ తనతో పాటు వరుస సీరియల్స్ చేసిన బుల్లితెర నటితో ఎఫైర్ కొనసాగించారనే టాక్ అప్పట్లో తెగ వైరల్ అయింది.(Prabhakar)