Prabhas Missed Films: ఎన్టీఆర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రం నుంచి తప్పించుకున్న ప్రభాస్!!


Prabhas Missed Films, NTR’s Gain

Prabhas Missed Films: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాహుబలి (Baahubali) సినిమాతో ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ, తన కెరీర్‌లో కొన్ని హిట్ సినిమాలను తిరస్కరించారు. ఈ చిత్రాలు వేరే హీరోలకు బ్లాక్ బస్టర్ విజయాలను అందించాయి. అయితే ప్రభాస్ రిజెక్ట్ చేసిన ఓ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది.

Prabhas Missed Films, NTR’s Gain

ఎన్టీఆర్ నటించిన బృందావనం (Brindavanam) సినిమా మొదట ప్రభాస్‌కి ఆఫర్ చేయబడింది. అయితే, ఆయన అంగీకరించకపోవడంతో ఈ చిత్రం ఎన్టీఆర్ చేతికి వెళ్లింది. ఎన్టీఆర్, కాజల్, సమంత కలిసి చేసిన ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. అదే విధంగా, సింహాద్రి (Simhadri) కూడా మొదట ప్రభాస్‌కి ఆఫర్ చేయబడగా, ఆయన తిరస్కరించారు. అయితే, ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు.

అలాగే జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) కెరీర్‌లో అశోక్ (Ashok) ఒక భారీ ఫ్లాప్ సినిమా అయితే మొదట ఈ సినిమాను దర్శకుడు ప్రభాస్‌కి వినిపించగా, ఆయన ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌ను ఒకే చెప్పి సూపర్ ఫ్లాప్ ను అందుకున్నారు. అలాగే ఊసరవెల్లి (Oosaravelli) అనే సినిమా కూడా మొదట ప్రభాస్‌కి Narrate చేయబడింది. కానీ, ఆయన తిరస్కరించడంతో ఆ ఛాన్స్ ఎన్టీఆర్‌కి వచ్చింది. అది కూడా పెద్దగా విజయం సాధించలేకపోయింది.

ఏదేమైనా ప్రభాస్ రిజెక్ట్ చేసిన ఈ సినిమాలు ఎన్టీఆర్ చేయడం కొంత వరకు హిట్ లు అందుకున్నా రెండు సినిమాలు మాత్రం భారీ ఫ్లాప్ ఇచ్చాయి. కొంతమంది హీరో లు వదిలేసిన సినిమాలు వేరే హీరో లు చేసి ఈ విధంగా హిట్ లు , ఫ్లాప్ అందుకుంటూ ఉంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *