Prabhas: ‘ఫౌజీ’ మూవీ పూర్తికాకముందే హను తో కొత్త ప్రాజెక్ట్? వేరే లెవెల్ స్టొరీ!!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా స్వాతంత్ర్య సంగ్రామం నేపథ్యంలో సాగుతుందని, ప్రభాస్ ఒక సైనికుడిగా కనిపించనున్నట్లు సమాచారం. అయితే, ఈ సినిమా పూర్తికాకముందే హను రాఘవపూడితో మరో సినిమా చేయాలని ప్రభాస్ నిర్ణయించాడట.
Prabhas Plans Another Film with Hanu
ప్రభాస్ హను రాఘవపూడి మేకింగ్ స్టైల్, విజన్ చూసి బాగా ఆకర్షితుడయ్యాడని ఇన్‌సైడ్ టాక్. దీంతో ప్రముఖ నిర్మాణ సంస్థ ద్వారా హనుకు అడ్వాన్స్ కూడా ఇప్పించారని సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ముందు ప్రభాస్ చేతిలో ఉన్న భారీ సినిమాలు పూర్తి కావాలి.
ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’, ‘ది రాజాసాబ్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్ 2’, నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2’, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘బ్రహ్మరాక్షస్’ వంటి సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి.
ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే హను రాఘవపూడితో రెండో సినిమా ప్రారంభం కానుంది. ‘ఫౌజీ’ టైటిల్ ఇంకా ఖరారు కాలేదు, కానీ ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ప్రభాస్ – హను కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి!